News September 9, 2024
వరద బాధితులకు గుడ్ న్యూస్?

TG: వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సర్వం కోల్పోయిన ప్రతి ఇంటికీ రూ.17,500 ఇవ్వనున్నట్లు సమాచారం. గతంలో ఇంటింటికీ రూ.10 వేలు ఇస్తామని ప్రకటించింది. కానీ అది సరిపోదని, ఉదారంగా సాయం చేయాలని సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇంటి మరమ్మతులకు రూ.6,500, దుస్తులకు రూ.2,500, వస్తువులకు రూ.2,500, కూలీ కింద రూ.6,000 కలిపి మొత్తం రూ.17,500 ఇవ్వనుంది.
Similar News
News December 16, 2025
పెళ్లి వార్తలను ఖండించిన హీరోయిన్ మెహ్రీన్

తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలను హీరోయిన్ మెహ్రీన్ ఖండించారు. ఓ వ్యక్తితో తనకు పెళ్లి జరగబోతున్నట్లు ఆర్టికల్స్ రాశారని, కానీ అతనెవరో తనకు తెలియదని, ఎప్పుడూ మాట్లాడలేదని తెలిపారు. ఒకవేళ తాను నిజంగా మ్యారేజ్ చేసుకుంటే అందరికీ తెలియజేస్తానని పేర్కొన్నారు. ఫేక్ ఆర్టికల్స్ రాయడంపై ఫైరయ్యారు. పొలిటీషియన్ భవ్య బిష్ణోయ్తో ఆమెకు 2021లో ఎంగేజ్మెంట్ జరిగింది. తర్వాత పెళ్లి రద్దయింది.
News December 16, 2025
భార్య నల్లగా ఉందని..

AP: పల్నాడు(D) వినుకొండలో అమానవీయ ఘటన జరిగింది. భార్య నల్లగా ఉందని భర్త, అశుభాలు జరుగుతున్నాయంటూ అత్తమామలు వేధించారు. చివరికి ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. లక్ష్మి, కోటేశ్వరరావులకు ఈ జూన్ 4న వివాహమైంది. ₹12L నగదు, 25 సవర్ల బంగారం కట్నంగా ఇవ్వగా, ఆమె నల్లగా ఉందనే సాకుతో అదనపు కట్నం కోసం వేధించారు. తాజాగా గెంటేయడంతో భర్త ఇంటి ముందు లక్ష్మి ధర్నా చేశారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
News December 16, 2025
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో రికార్డు

ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. 600 బిలియన్ డాలర్లకు పైగా నెట్వర్త్ సాధించిన తొలి వ్యక్తిగా నిలిచినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. 2026లో 800B డాలర్ల విలువతో స్పేస్-X ఐపీవోకు వస్తుండటంతో మస్క్ సంపద గణనీయంగా పెరిగింది. అక్టోబర్లో 500B డాలర్ల మార్క్ను దాటిన మస్క్, కేవలం 2 నెలల్లోనే మరో 100B డాలర్లను సంపాదించారు. ప్రస్తుతం ఆయన నెట్వర్త్ సుమారు $677Bగా ఉంది.


