News October 30, 2024

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

image

TG: ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీపావళి సందర్భంగా 3.64 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది 2022 జులై 1 నుంచి వర్తిస్తుందని తెలిపింది. పెరిగిన డీఏను నవంబర్ జీతంతో కలిపి ఇవ్వనుంది. 2022 జులై నుంచి 2024 అక్టోబర్ 31 వరకు ఉన్న డీఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో జమ చేయనున్నారు.

Similar News

News November 24, 2025

వంటింటి చిట్కాలు

image

* కేక్ మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ గ్లిజరిన్ కలిపితే కేక్ ఎక్కువకాలం తాజాగా ఉంటుంది.
* పూరీలు మృదువుగా రావాలంటే పిండిని పాలతో కలపాలి.
* కూరల్లో గ్రేవీ చిక్కగా రావాలంటే అందులో కొంచెం కొబ్బరి పాలు లేదా పెరుగు కలపాలి.
* దుంపలు ఉడికించిన నీటితో వెండి పట్టీలు శుభ్రం చేస్తే తళతలా మెరుస్తాయి.
* కాలీఫ్లవర్‌ కూరలో టేబుల్ స్పూన్ పాలు కలిపితే కూర రుచిగా ఉంటుంది.

News November 24, 2025

6GHz స్పెక్ట్రమ్‌ వివాదం.. టెలికం vs టెక్ దిగ్గజాలు

image

6GHz బ్యాండ్‌ కేటాయింపుపై రిలయన్స్‌ జియో, VI, ఎయిర్‌టెల్‌కి వ్యతిరేకంగా అమెరికన్‌ టెక్‌ దిగ్గజాలు ఏకం అయ్యాయి. మొత్తం 1200 MHz‌ను మొబైల్‌ సేవల కోసం వేలానికి పెట్టాలని జియో కోరగా Apple, Amazon, Meta, Cisco, HP, Intel సంస్థలు ఈ బ్యాండ్‌ మొబైల్‌ సేవలకు సాంకేతికంగా సిద్ధంగా లేదని పేర్కొన్నాయి. పూర్తిగా వైఫై కోసం మాత్రమే ఉంచాలని TRAIకి సూచించాయి.

News November 24, 2025

‘భూ భారతి’లో భూముల మార్కెట్ విలువ!

image

TG: ‘భూ భారతి’ వెబ్‌సైట్‌లో భూముల మార్కెట్ విలువను తెలుసుకునేలా ప్రభుత్వం ఆప్షన్ తీసుకొచ్చింది. ఆస్తుల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ కోసం అధికారిక వెబ్‌సైట్‌లో తెలుగు, ఇంగ్లిష్‌లో ఈ సదుపాయాన్ని అందిస్తోంది. సర్వే నంబర్ ఉన్న ప్రతి ల్యాండ్ మార్కెట్ విలువ ఇందులో ఉంటుంది. ధరణి పోర్టల్‌లోని లోపాలను సరిదిద్దేందుకు ‘భూ భారతి’ని తీసుకొచ్చినట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.