News January 16, 2025

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

image

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ(లీవ్ ట్రావెల్ కన్సెషన్) స్కీమ్ కింద ప్రీమియం రైళ్లలోనూ ప్రయాణించే వెసులుబాటును కేంద్రం కల్పించింది. తేజస్, వందే భారత్, హంసఫర్ వంటి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతిచ్చింది. దీని ప్రకారం ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు ప్రయాణ సమయంలో వేతనంతో కూడిన సెలవుతో పాటు టికెట్ ఖర్చులకు రీయింబర్స్‌మెంట్ పొందవచ్చు.

Similar News

News October 15, 2025

ఆన్‌లైన్ వేధింపులు ఎలా ఎదుర్కోవాలంటే?

image

టెక్నాలజీ పెరిగే కొద్దీ ఈ డిజిటల్ ప్రపంచంలో మోసాలు, మహిళలపై వేధింపులూ పెరుగుతున్నాయి. ఈ విషవలయంలో అతివలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు నిపుణులు. తెలిసినవారేనని ఫొటోలు, వీడియోలు పంపకూడదు. పాస్‌వర్డ్‌లు ఎప్పటికప్పుడు మార్చుకోవాలి. థర్డ్‌పార్టీ యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. వెబ్‌క్యామ్‌ను ఎప్పుడూ ఆఫ్‌ చేసి ఉంచాలి. సైబర్‌ నేరాల బాధితులైతే సహాయం కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1930కి డయల్‌ చేయాలని సూచిస్తున్నారు.

News October 15, 2025

త్రిముఖ పోరులో గెలిచేదెవరు?

image

ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్(INC), మాగంటి సునీత(BRS), దీపక్ రెడ్డి(BJP) బరిలోకి దిగనున్నారు. అధికార కాంగ్రెస్ తన బలాన్ని నిరూపించుకోవాలని చూస్తుండగా, BRS సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ప్రభుత్వ పనితీరు, సానుభూతి, స్థానిక సమస్యల్లో ఏ అంశం ప్రభావం చూపుతుందనే చర్చ జరుగుతోంది. దీని ఫలితం గురించి రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

News October 15, 2025

ప్రముఖ నటుడు కన్నుమూత

image

వెటరన్ బాలీవుడ్ యాక్టర్ పంకజ్ ధీర్(68) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన నిన్న తుదిశ్వాస విడిచినట్లు సినీ& TV ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపింది. 1988-94 మధ్య BR చోప్రా తెరకెక్కించిన ‘మహాభారత్’ టీవీ సీరియల్‌లో కర్ణుడి పాత్రతో పంకజ్ గుర్తింపు పొందారు. పలు బాలీవుడ్ సినిమాలు, టీవీ సీరియళ్లలో ఆయన నటించారు.