News October 7, 2024
గ్రూప్-4 అభ్యర్థులకు GOOD NEWS!

TG: గ్రూప్-4 పరీక్ష ఫైనల్ సెలక్షన్ ప్రక్రియను త్వరలోనే చేపడతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఇవాళ కొంతమంది అభ్యర్థులు మంత్రిని కలిసి తమ సమస్యను విన్నవించారు. తుమ్మల TGPSC ఛైర్మన్ మహేందర్ రెడ్డికి కాల్ చేసి.. తుది ఫలితాలను వెంటనే ప్రకటించాలని కోరారు. కాగా, 2023లో గ్రూప్-4 పరీక్షలు నిర్వహించగా, 45 రోజుల క్రితం సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయింది. కానీ నియామక ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది.
Similar News
News November 13, 2025
కూరగాయల సాగు.. ఎకరాకు రూ.9,600 సబ్సిడీ

TG: రాష్ట్రంలో ఏటా 10వేల ఎకరాల మేర కూరగాయల సాగు విస్తీర్ణం పెంచేందుకు ఉద్యానశాఖ చర్యలు చేపట్టింది. రైతులకు ఈ సీజన్ నుంచే ఎకరాకు రూ.9,600 సబ్సిడీని వారి ఖాతాల్లో జమ చేస్తోంది. అటు పలు రకాల కూరగాయల నారు కూడా సిద్ధం చేసింది. నారు అవసరం ఉన్నవారి నుంచి అప్లికేషన్లు తీసుకుంటోంది. నారు, సబ్సిడీ కావాల్సిన రైతులు సంబంధిత మండలాల్లో హార్టికల్చర్ ఆఫీసర్లకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
News November 13, 2025
శీతాకాలంలో స్కిన్ బావుండాలంటే..

చలికాలంలో చర్మం ఈజీగా పొడిబారి, పగుళ్లు వస్తాయి. ఇలాకాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలంటున్నారు నిపుణులు. ఈ కాలంలో మాయిశ్చరైజర్ ఎక్కువగా వాడాలి. గోరువెచ్చటి నీళ్లతోనే స్నానం చేయాలి. చర్మానికి తేమనిచ్చే సబ్బులనే వాడాలి. చేతులకు గ్లౌజులు, కాళ్లకు సాక్సులు ధరించాలి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, పండ్లు, ఆకుపచ్చని కూరగాయలు, తగినంత నీరు తీసుకుంటే చర్మం తేమగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
News November 13, 2025
ఫ్రీ బస్ పథకం.. ఆర్టీసీకి రూ.7980Cr చెల్లింపు: మంత్రి పొన్నం

TG: RTCలో ఇప్పటి వరకు మహిళలు 237కోట్ల జీరో టికెట్ ఉపయోగించుకున్నారని, ప్రభుత్వం RTCకి ₹7980Cr చెల్లించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. RTC ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ పెంచుకోవడానికి అవకాశాలను అన్వేషించాలని ఆదేశించారు. బస్సు ప్రమాదాలు నివారించేందుకు డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ను అమలు చేస్తామన్నారు. కారుణ్య నియామకాల ప్రొవిజనల్ పీరియడ్ను 3 నుంచి 2ఏళ్లకు తగ్గించాలన్నారు.


