News February 3, 2025
చేనేత కార్మికులకు గుడ్ న్యూస్
TG: నేత కార్మికులకు ‘వర్కర్ టు ఓనర్’ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో నిర్మించిన వీవింగ్ షెడ్లలో పవర్ లూమ్స్ బిగించి లబ్ధిదారులకు ఇవ్వనుంది. త్వరలోనే అర్హులను గుర్తించి తొలుత సిరిసిల్ల జిల్లాలో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఒక యూనిట్ కింద ₹8L విలువైన 4 లూమ్స్ ఇస్తారు. యూనిట్ విలువలో 50% సబ్సిడీ, 40% బ్యాంక్ లోన్, 10% లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.
Similar News
News February 3, 2025
చరిత్ర సృష్టించిన భారత ప్లేయర్
ENGతో T20 సిరీస్‌లో 14 వికెట్లు పడగొట్టిన వరుణ్ చక్రవర్తి చరిత్ర సృష్టించారు. ఓ ద్వైపాక్షిక T20 సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా నిలిచారు. 2021లో AUSపై కివీస్ స్పిన్నర్ ఇష్ సోధీ 13 వికెట్లు తీయగా, వరుణ్ ఇప్పుడు ఆ రికార్డ్‌ను బ్రేక్ చేశారు. ఓవరాల్‌గా ఓ T20 సిరీస్‌లో ఎక్కువ వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా వరుణ్ నిలిచారు. 2022లో ENGపై 15 వికెట్లు పడగొట్టిన హోల్డర్(విండీస్) టాప్‌లో ఉన్నారు.
News February 3, 2025
ఇవాళ్టి నుంచి ఆర్టిజన్ల పోరుబాట
TG: విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్లు(సబ్ స్టేషన్ల నిర్వాహకులు) వెంటనే కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 13 వరకు కన్వర్షన్ డిమాండ్‌ను నెరవేర్చాలని కోరుతూ బస్ యాత్రను మహబూబ్‌నగర్‌లో ప్రారంభించనున్నారు. అన్ని జిల్లాల్లో పర్యటన తర్వాత ఈ నెల 20వ తేదీన చలో విద్యుత్ సౌధ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
News February 3, 2025
అయోధ్య రామమందిర ప్రధాన అర్చకుడి ఆరోగ్యం విషమం!
అయోధ్య రామాలయం ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ ఆరోగ్యం క్షీణించింది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడిన ఆయనను హాస్పిటల్లో చేర్పించారు. అక్కడి నుంచి మొదట ట్రామా సెంటర్‌కి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం లక్నో ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు అయోధ్య సిటీ న్యూరో సెంటర్ వైద్యులు తెలిపారు. CT స్కాన్‌లో ఆయన మెదడులో రక్తస్రావం జరిగినట్లు తేలిందని వెల్లడించారు.