News August 9, 2025

HDFC కస్టమర్లకు గుడ్‌న్యూస్

image

HDFC బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్(MCLR)ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇది రుణ కాలపరిమితిని బట్టి 8.55%-8.75% మధ్య ఉండనుంది. ఓవర్ నైట్/ఒక నెల MCLR 8.60% నుంచి 8.55%కి, 3 నెలలకు 8.65% నుంచి 8.60%కి, 6 నెలలకు 8.75% నుంచి 8.70%కి, ఏడాది MCLR 9.05% నుంచి 8.75%కి తగ్గింది. ఈ తగ్గింపు ఈ నెల 7 నుంచి అమల్లోకి రాగా లోన్ల EMI చెల్లించే వారికి స్వల్ప ఊరట దక్కనుంది.

Similar News

News August 9, 2025

ఆ దేశంలో పెళ్లికి ఎవరైనా వెళ్లొచ్చు..!

image

సాధారణంగా పెళ్లిళ్లకు బంధువులు, స్నేహితులు వెళ్తుంటారు. కానీ ఫ్రాన్స్‌లో మాత్రం ఎవరి పెళ్లికి ఎవరైనా వెళ్లొచ్చు. ఒక్కొక్కరు రూ.10 వేలు చెల్లించి టికెట్ కొని పెళ్లి చూడొచ్చు. పెళ్లిలో డ్రెస్ కోడ్ పాటించాలి. విందు ఆరగించవచ్చు. కొత్త పరిచయాలు చేసుకోవచ్చు. పెళ్లి మనదే అనేలా ఎంజాయ్ చేయొచ్చు. ‘ఇన్విటిన్’ సంస్థ ఈ ట్రెండ్ స్టార్ట్ చేసింది. ఇండియాలోనూ ‘జాయిన్ మై వెడ్డింగ్’ అనే పేరుతో ఈ ట్రెండ్ వచ్చేసింది.

News August 9, 2025

నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

TGలోని NLG, సూర్యాపేట, MHBD, WGL, HNK, HYD, జనగాం, యాదాద్రి, రంగారెడ్డి, MBNR, NGKL, వనపర్తి, గద్వాల్ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. అటు APలోని ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA పేర్కొంది.

News August 9, 2025

అన్నదాత సుఖీభవ.. త్వరలో వారి ఖాతాల్లోకి డబ్బులు

image

AP: వివిధ కారణాలతో ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద సాయం అందని రైతుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. వ్యవసాయ శాఖ చేపట్టిన గ్రీవెన్స్‌కు ఈ నెల 3 నుంచి 8వ తేదీ వరకు 10,915 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా నుంచి 1,290 మంది రైతులు అప్లై చేసుకున్నారు. గ్రీవెన్స్‌లో సమస్య పరిష్కారమై, పథకానికి అర్హులైన వారికి త్వరలో నగదు జమ అవుతుందని అధికారులు స్పష్టం చేశారు.