News April 6, 2025
ఇళ్లు కట్టుకునేవారికి శుభవార్త

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. మొదటి విడతలో మండలానికి ఓ గ్రామం నుంచి మొత్తం 71 వేల మందిని ఎంపిక చేసింది. ఇప్పుడు మిగతా గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు అర్హులను ఎంపిక చేస్తున్నాయి. ఈ నెలాఖరులోగా మొత్తం 4.50 లక్షల మందితో జాబితా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జూన్‌లోగా తొలి విడత డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
Similar News
News April 7, 2025
ALERT: ఆ జిల్లాల వారు జాగ్రత్త!

AP: రాష్ట్రంలో భానుడు భగభగలు పుట్టిస్తున్నాడు. ఆదివారం కర్నూలు జిల్లా కామవరంలో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల మార్కును దాటింది. ఈరోజు రాయలసీమ ప్రాంతాల్లో 42 డిగ్రీల వరకు, ఉత్తరాంధ్రలో 41డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో ఎండలోకి వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.
News April 7, 2025
రేపు అహ్మదాబాద్‌కు సీఎం రేవంత్

TG: గుజరాత్లో రేపు, ఎల్లుండి జరిగే ఏఐసీసీ సమావేశాలకోసం సీఎం రేవంత్ రేపు అహ్మదాబాద్‌కు వెళ్లనున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు, పలువురు కీలక నేతలు ఈరోజు సాయంత్రమే బయలుదేరనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నుంచి మొత్తం 44మంది నేతలకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. జాతీయస్థాయిలో అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాలపై ఈ సమావేశాల్లో చర్చకు వస్తాయని సమాచారం.
News April 7, 2025
రేపు సింహాద్రి అప్పన్న కళ్యాణం

AP: ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం రేపు అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రతి ఏటా చైత్ర శుద్ధ ఏకాదశి పర్వదినాన స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు రాత్రి అంకురార్పణతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. రేపు మధ్యాహ్నం కొట్నాల ఉత్సవం, ఎదురు సన్నాహం పూర్తవుతాయి. రాత్రి 8గంటలకు రథోత్సవం, 9.30గంటలకు స్వామి కళ్యాణ మహాత్సవం జరుగుతాయి.