News October 14, 2025

హోమ్ లోన్లు తీసుకున్నవారికి గుడ్‌న్యూస్

image

రిజర్వ్ బ్యాంక్ రెపో <<17882889>>రేట్‌ను<<>> 5.50శాతంగా కొనసాగించడంతో HDFC, BOB, ఇండియన్ బ్యాంక్, IDBI బ్యాంకు MCLR రేట్లను తగ్గించాయి. దీంతో ఆయా బ్యాంకుల్లో హోమ్ లోన్లపై EMI తగ్గింది. టెన్యూర్‌ను బట్టి BOBలో కనిష్ఠంగా 7.85శాతం, గరిష్ఠంగా 8.75శాతం, IDBIలో 8-9.70శాతం, ఇండియన్ బ్యాంక్‌లో 7.95-8.85శాతం, HDFCలో 8.4-8.65 శాతం వరకు లోన్లు లభిస్తున్నాయి. తగ్గించిన వడ్డీరేట్లు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి.

Similar News

News October 14, 2025

నాపై కొందరు రెడ్లు కుట్ర చేస్తున్నారు: సురేఖ

image

TG: తమ ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని కొందరు రెడ్లు చూస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ‘మేడారం జాతర పనుల బాధ్యతను మంత్రి పొంగులేటికి కూడా CM అప్పజెప్పారు. టెండర్ల ఖరారు పారదర్శకంగా జరిగి పనులు త్వరగా కావాలన్నదే నా ఉద్దేశం. మా మధ్య విభేదాలు లేవు. అయితే కొందరు ప్రతీది వివాదం చేయాలని చూస్తున్నారు’ అని చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. హీరో <<17283242>>నాగార్జున <<>>కుటుంబ వ్యవహారంలోనూ వివాదం సృష్టించారన్నారు.

News October 14, 2025

ఇంటర్ పరీక్షలు ఎప్పుడంటే?

image

TG: ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి చివరివారంలో మొదలయ్యే అవకాశముంది. 2026 FEB 25 నుంచి పరీక్షలు నిర్వహించేలా టైం టేబుల్‌ ఫైల్‌ను ఇంటర్ బోర్డు CMకు పంపినట్లు తెలుస్తోంది. దీనికి రేవంత్ సైతం ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు Way2Newsకు వెల్లడించాయి. ఎంట్రన్స్ పరీక్షలు(JEE మెయిన్, ఎప్‌సెట్) ఉండటంతో షెడ్యూల్ ముందుకు జరిపినట్లు సమాచారం. అటు ఏపీలో FEB 23 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

News October 14, 2025

వైట్ డిశ్చార్జ్ గురించి తెలుసుకోండి

image

మహిళల్లో కనిపించే అత్యంత సాధారణ లక్షణం వైట్ డిశ్చార్జ్. అయితే ఇది కొన్నిసార్లు ప్రమాదకరంగా మారుతుందంటున్నారు నిపుణులు. దుర్వాసన, రంగుమారడం, మంట అసౌకర్యం వంటి లక్షణాలకు ఇన్ఫెక్షన్లు, లైంగిక వ్యాధులు కారణం కావొచ్చంటున్నారు. నిర్లక్ష్యం చేస్తే ఫెలోపియన్‌ ట్యూబ్స్‌ మూసుకుపోయి గర్భధారణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఇబ్బంది ఎదురైతే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. <<-se>>#Womenhealth<<>>