News October 22, 2024
రెండో టెస్టుకు ముందు భారత్కు గుడ్ న్యూస్!

న్యూజిలాండ్తో రెండో టెస్టుకు ముందు భారత జట్టు అసిస్టెంట్ కోచ్ గుడ్ న్యూస్ చెప్పారు. గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన గిల్ అందుబాటులో ఉంటారని చెప్పారు. మరోవైపు పంత్ కూడా ఫిట్గా ఉన్నారని పేర్కొన్నారు. కాగా గిల్ స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ సెంచరీతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. దీంతో విఫలమైన రాహుల్ను పక్కన పెట్టే అవకాశం ఉన్నట్లు క్రీడావర్గాలు పేర్కొన్నాయి.
Similar News
News December 6, 2025
ఇండిగో సంక్షోభం వేళ రైల్వే కీలక నిర్ణయం

ఇండిగో ఫ్లైట్స్ రద్దు కారణంగా ప్రయాణికుల రద్దీ పెరగడంతో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 37 రైళ్లకు 116 అదనపు కోచ్లు అనుసంధానించినట్లు సంబంధిత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దక్షిణ రైల్వేలో 18 రైళ్లకు అత్యధికంగా కోచ్లు పెంచారు. ఉత్తర, పశ్చిమ, తూర్పు, ఈశాన్య రైల్వే జోన్లలో కూడా స్పెషల్ కోచ్లు ఏర్పాటు చేశారు. అదనంగా 4 ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతున్నారు.
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


