News September 21, 2024

ఇంటర్ విద్యార్థులకు GOOD NEWS

image

AP: వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌లో CBSE సిలబస్ అమలు చేయడానికి ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. దీనివల్ల మ్యాథ్స్‌, ఫిజిక్స్, కెమిస్ట్రీలో సిలబస్ తగ్గనుంది. అలాగే గణితంలో ప్రస్తుతం ఉన్న 2 పేపర్లను ఒకటిగా చేయాలా? అలాగే కొనసాగించాలా అనే అంశంపై అధికారులు చర్చిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు JEE మెయిన్స్, అడ్వాన్స్, నీట్ కోచింగ్ ఇప్పించాలని విద్యాశాఖ యోచిస్తోంది.

Similar News

News September 21, 2024

డిగ్రీ కోర్సులను మార్చుకోవాలనుకుంటున్నారా?

image

TG: డిగ్రీ కోర్సులను మార్చుకునేందుకు విద్యాశాఖ అధికారులు అవకాశం కల్పించారు. దోస్త్ కౌన్సెలింగ్‌లో భాగంగా రాష్ట్రంలో ఇప్పటికే డిగ్రీ సీట్లు భర్తీ చేశారు. ఈనెల 21 నుంచి 23 వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకుంటే 24న కొత్త కోర్సుల కేటాయింపు జాబితాను ప్రకటించనున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News September 21, 2024

ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో ట్విస్ట్

image

AP: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై అత్యాచార ఆరోపణలు చేసిన మహిళ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. తాను ఇచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలు అవాస్తవమని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో ఎమ్మెల్యేపై తొందరపాటు చర్యలు వద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది.

News September 21, 2024

రాష్ట్రంలో పరువు హత్య

image

AP: అన్యమతస్థుడిని పెళ్లి చేసుకున్న కూతురిని పేరెంట్స్ హతమార్చిన ఘటన నెల్లూరు(D) పద్మనాభునిసత్రంలో జరిగింది. రమణయ్య, దేవసేనమ్మల చిన్నకూతురు శ్రావణి(24) భర్తతో విడిపోయింది. ఇటీవల రబ్బానీ బాషాను పెళ్లిచేసుకోగా తల్లిదండ్రులు, సోదరి, సోదరుడు ఆమెను ఇంటికి తీసుకొచ్చి కొట్టడంతో చనిపోయింది. దీంతో ఇంటిపక్కనే పూడ్చిపెట్టారు. 25 రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తల్లిదండ్రులను అరెస్టు చేశారు.