News July 30, 2024
మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్
హైదరాబాద్‌లో మెట్రో రైళ్లు ఇకపై ఉ.5.30 గంటల నుంచే ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ, అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రయోగాత్మకంగా గత శుక్రవారం ఉ.5.30 గంటలకే రైళ్లు నడపగా మంచి స్పందన వచ్చిందని వెల్లడించారు. దీంతో ప్రతిరోజూ అదే సమయానికి మెట్రో సేవలు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.
Similar News
News February 1, 2025
బిహార్‌కు వరాల జల్లు
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్‌కు కేంద్రం బడ్జెట్‌లో పెద్ద పీట వేసింది.
*బిహార్ కేంద్రంగా మఖానా బోర్డు ఏర్పాటు
*బిహార్‌లో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు
*నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఏర్పాటు
*పట్నా విమానాశ్రయం విస్తరణ
*బిహార్ మిథిలాంచల్ ప్రాంతంలో కొత్తగా రేవు ఏర్పాటు
News February 1, 2025
ఫుట్‌వేర్ సెక్టార్‌కు కొత్త స్కీమ్.. 22 లక్షల మందికి ఉపాధి
ఫుట్‌వేర్, లెదర్ సెక్టార్‌లో ఉత్పత్తి, నాణ్యతను మెరుగుపరించేందుకు ప్రత్యేక పాలసీని తీసుకురానున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నాణ్యమైన లెదర్, నాన్ లెదర్ పాద రక్షల ఉత్పత్తి, డిజైన్, యంత్రాలకు మద్దతునివ్వడానికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుందని తెలిపారు. కొత్తగా 22 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. రూ.1.1 లక్షల కోట్ల ఎగుమతులు సాధిస్తుందని చెప్పారు.
News February 1, 2025
BUDGET 2025-26: ముఖ్యాంశాలు
*గిగ్ వర్కర్లకు ఐడీ కార్డులు.. ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు
*అన్ని ప్రభుత్వ పాఠశాలలకు బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం
*MSMEలకు రూ.10వేల కోట్లతో ఫండ్
*నమోదు చేసుకున్న సూక్ష్మ సంస్థలకు తొలి ఏడాది రూ.10 లక్షల వరకు క్రెడిట్ కార్డులు
*నగరాల అభివృద్ధి కోసం అర్బన్ ఛాలెంజ్ బోర్డు
*సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు అదనపు నిధులు
*ప్రతి జిల్లాలో క్యాన్సర్ ఆస్పత్రులు