News August 24, 2024

మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్!

image

మెట్రోస్టేషన్ల వద్ద పెయిడ్ పార్కింగ్ అమలు చేయడంపై మెట్రో అధికారులు మరోసారి వెనక్కి తగ్గారు. ప్రయాణికుల సమస్యలను పరిష్కరించేందుకు పెయిడ్ పార్కింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్ల వద్ద ఫ్రీ పార్కింగ్ సదుపాయం పునరుద్ధరించాలని రేపు నాగోల్‌లో ప్రయాణికులు మహాధర్నా చేయనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Similar News

News March 30, 2026

4 లక్షల చాక్లెట్స్ చోరీ.. కంపెనీ ఫన్నీ రియాక్షన్!

image

4.14 లక్షల చాక్లెట్లు చోరీ కావడంపై నెస్లే బ్రాండ్ ‘కిట్ క్యాట్’ ఫన్నీగా స్పందించింది. ‘కిట్‌క్యాట్‌తో బ్రేక్ తీసుకోమని మేం చెబుతుంటాం. కానీ ఈ దొంగలు మా స్లోగన్‌ను మరీ సీరియస్‌గా తీసుకున్నారు. ఏకంగా 12 టన్నుల చాక్లెట్లతో బ్రేక్ తీసుకున్నారు’ అని పేర్కొంది. మార్చి 26న చాక్లెట్ల లోడుతో ఇటలీ నుంచి పోలండ్ వెళ్తున్న ట్రక్కు మార్గమధ్యంలో మాయమైపోయింది. ఇప్పటికీ దాని ఆచూకీ తెలియరాలేదని నెస్లే తెలిపింది.

News March 30, 2026

నామినేషన్ వేసిన CM స్టాలిన్, విజయ్

image

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ కొలత్తూరు నుంచి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నామినేషన్ దాఖలు చేశారు. అటు తమిళగ వెట్రి కళగం(TVK) అధినేత, నటుడు విజయ్ దళపతి కూడా పెరంబూరు నియోజకవర్గానికి సంబంధించి చెన్నైలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

News March 30, 2026

చైనా సీసీటీవీలపై దేశంలో బ్యాన్?

image

ఏప్రిల్ 1 నుంచి హిక్‌విజన్, దహువా, TP-Link తదితర చైనా CCTV కెమెరాలు, పరికరాలను దేశంలో బ్యాన్ చేయనున్నట్లు తెలుస్తోంది. దేశంలో అమ్మే CCTV ప్రొడక్టులు కచ్చితంగా అనుమతి తీసుకోవాలని కేంద్రం కొత్త రూల్ తీసుకొచ్చింది. భద్రతా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో చైనా సంస్థలు, ఆ దేశంలో తయారైన చిప్‌సెట్‌లను ఉపయోగించే పరికరాలకు పర్మిషన్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నట్లు సమాచారం.