News April 4, 2025

MIకి గుడ్‌న్యూస్.. త్వరలోనే బుమ్రా ఆగమనం?

image

ముంబై ఇండియన్స్‌ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. వెన్నెముక గాయంతో BGT సిరీస్‌ ఆఖరి మ్యాచ్‌లో ఆయన దూరమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రికవరీలోనే ఉన్న ఈ పేసర్ తిరిగి ఫిట్‌నెస్ సాధించినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. మరో రెండు మ్యాచ్‌ల తర్వాత నుంచి ఆయన అందుబాటులోకి రానున్నారని తెలిపాయి. ఈలోపు తుది దశ ఫిట్‌నెస్ టెస్టుల్లో పాల్గొంటారని సమాచారం.

Similar News

News April 11, 2025

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు బీజేపీ నగదు బహుమతి

image

మాజీ రెజ్లర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వినేశ్ ఫొగట్‌కు హరియాణా BJP ప్రభుత్వం నగదు బహుమతి ప్రకటించింది. బరువు ఎక్కువున్న కారణంతో వినేశ్ ఒలింపిక్స్ ఫైనల్లో డిస్ క్వాలిఫై అవ్వగా ఆమెకు పతక విజేతలకు ఇచ్చే గౌరవాన్నే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఇల్లు/ఉద్యోగం/నగదులో ఏది కావాలో ఎంచుకోవాలని సూచించగా ఆమె నగదుకే మొగ్గు చూపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వినేశ్‌కు రూ.4 కోట్ల నగదు ఇవ్వనుంది.

News April 11, 2025

PHOTO GALLERY: కులవృత్తుల వారికి పనిముట్లు అందించిన సీఎం

image

AP: ఏలూరు జిల్లా ఆగిరిపల్లి(మ) వడ్లమానులో వివిధ కులవృత్తుల వారితో సీఎం చంద్రబాబు మాట్లాడారు. వారికి పనిముట్లు, ప్రోత్సాహకాలు అందించారు. కాసేపు సెలూన్ షాపులో కూర్చుని ముచ్చటించారు. పశువులకు మేత తినిపించారు. టీడీపీకి మొదటినుంచీ బీసీలే వెన్నెముక అని అన్నారు.

News April 11, 2025

భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

image

వారాంతంలో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. టారిఫ్స్‌ను 90 రోజులు నిలిపివేయాలన్న ట్రంప్ నిర్ణయం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల నేపథ్యంలో సెన్సెక్స్ 1,310 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 429 పాయింట్లు వృద్ధి సాధించింది. టాటా స్టీల్, పవర్ గ్రిడ్, NTPC, M&M, రిలయన్స్, కోటక్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్‌సెర్వ్, భారతీ ఎయిర్‌టెల్, HDFC బ్యాంక్ షేర్లు భారీ లాభాలు సాధించాయి.

error: Content is protected !!