News September 4, 2024
పెన్షన్ తీసుకునే వారికి గుడ్న్యూస్

EPS పెన్షనర్లకు కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ శుభవార్త చెప్పారు. సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్స్ సిస్టమ్(CPPS)కు EPFO ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. దీని ద్వారా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి దేశంలోని ఏ బ్యాంక్ నుంచైనా పెన్షన్ తీసుకోవచ్చు. ఇందుకోసం PPO(పెన్షన్ పేమెంట్ ఆర్డర్)ను ఒక చోటు నుంచి మరొక బ్రాంచ్కు మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. దీని కారణంగా 78 లక్షల మంది EPS పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది.
Similar News
News December 1, 2025
సిరిసిల్ల: వాలీబాల్ టోర్నీలో క్యాంప్ ఫైర్

రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాలీబాల్ క్రీడాకారులు సోమవారం సాయంత్రం క్యాంప్ ఫైర్ లో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. సిరిసిల్లలో నిర్వహిస్తున్న 8వ రాష్ట్రస్థాయి జూనియర్ వాలీబాల్ ఛాంపియన్షిప్ టోర్నీలో ఉమ్మడి జిల్లాలకు చెందిన 10 బాలికల, 10 బాలుర జట్లు పాల్గొంటున్నాయి. రోజంతా మ్యాచ్లతో బిజీబిజీగా గడిపిన క్రీడాకారులు సాయంత్రం కాగానే క్యాంప్ ఫైర్లో ఆడి పాడి సేద తీరారు.
News December 1, 2025
రేపు స్కూళ్లకు సెలవు ఉందా?

AP: దిత్వా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఇవాళ తిరుపతి, కడప, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులిచ్చారు. అయితే తుఫాను బలహీనపడటంతో రేపటికి ఎలాంటి సెలవు ప్రకటనలు వెలువడలేదు. దీంతో యథావిధిగా విద్యాసంస్థలు కొనసాగనున్నాయి. తమిళనాడులో భారీ వర్షాలు కొనసాగుతుండటంతో చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. పలు యూనివర్సిటీల పరీక్షలను వాయిదా వేశారు.
News December 1, 2025
25,487 ఉద్యోగాలు.. అర్హతలివే

సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో 25,487 కానిస్టేబుల్(GD) ఉద్యోగాలకు <<18442408>>నోటిఫికేషన్<<>> విడుదలైంది. అర్హతలు: 01-01-2026 నాటికి 18-23ఏళ్ల వయసు(రిజర్వేషన్ బట్టి సడలింపు), టెన్త్ ఉత్తీర్ణత సాధించాలి. అప్లికేషన్ ఫీజు రూ.100. NCC ‘A’ సర్టిఫికెట్ ఉంటే 2%, NCC ‘B’కి 3%, NCC ‘C’కి 5% మార్కులను జత చేస్తారు. ఆన్లైన్ ఎగ్జామ్, PET, PST ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్: https://ssc.gov.in


