News March 17, 2025

విద్యుత్ సంస్థల గుడ్ న్యూస్.. ట్రూడౌన్‌కు ప్రతిపాదన

image

AP: రాష్ట్ర ప్రజలకు విద్యుత్ సంస్థలు గుడ్ న్యూస్ చెప్పాయి. రూ.1,059 కోట్లు డిస్కంలకు సర్దుబాటు చేయాలని ఐదేళ్ల తర్వాత ట్రాన్స్‌కో APERCలో పిటిషన్ దాఖలు చేసింది. 2019-24 మధ్య పెట్టుబడి వ్యయం కింద వివిధ పనులకు APERC అనుమతించిన ఖర్చు, వాస్తవ ఖర్చు మధ్య వ్యత్యాసాన్ని ట్రూడౌన్ కింద సర్దుబాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ మేరకు వినియోగదారులకు కరెంట్ ఛార్జీలు తగ్గే అవకాశం ఉంటుంది.

Similar News

News January 23, 2026

పిల్లలు ఎత్తు పెరగట్లేదా?

image

కొంతమంది పిల్లలు వయస్సుకు తగ్గట్లు ఎత్తు పెరగరు. ఇలా కాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లలకు ప్రొటీన్లు ఉన్న ఆహారాన్ని ఇవ్వాలంటున్నారు నిపుణులు. క్యారెట్, బీన్స్, బచ్చలికూర, బఠాణీ, అరటి, సోయాబీన్, పాలు, గుడ్లు డైట్‌లో చేర్చాలి. వీటిలో ఉండే కాల్షియం, మినరల్స్ పిల్లలు ఎత్తు పెరగడానికి సహాయపడతాయి. అలాగే రోజూ వ్యాయామం, సైక్లింగ్ చేయిస్తే గ్రోత్ హార్మోన్స్‌ పెరగడానికి దోహదం చేస్తాయి.

News January 23, 2026

TTD ట్రస్టులకు రూ.2.50 కోట్ల విరాళం

image

AP: TTDలోని పలు ట్రస్టులకు హైదరాబాద్‌కు చెందిన పీఎల్‌ రాజు కన్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్ రూ.2.50కోట్ల భారీ విరాళాన్ని శుక్రవారం అందించింది. శ్రీవేంకటేశ్వర ప్రాణ, విద్యాదాన ట్రస్టులకు చెరో రూ.75లక్షలు, బర్డ్ ట్రస్టుకు రూ.50లక్షలు, అన్నప్రసాదం, గోసంరక్షణ ట్రస్టులకు చెరో రూ.25లక్షల విలువైన డీడీలను TTD అదనపు EOకు సంస్థ అధినేత అందజేశారు.

News January 23, 2026

పుట్టు వెంట్రుకలు ఎప్పుడు తీయాలంటే?

image

మగపిల్లలకు 3, 5, 7, 9, 11వ నెలలో లేదా 3వ ఏట, ఆడపిల్లలకు 4, 6, 8, 10, 12వ నెలలో లేదా సరి సంవత్సరాల్లో ఈ కార్యం చేయాలని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. సోమ, బుధ, గురు, శుక్రవారాలు పుట్టు వెంట్రుకలు తీయడానికి అత్యంత శ్రేష్ఠమైనవని చెబుతున్నారు. ఆది, మంగళ, శనివారాలను నివారించాలని శాస్త్రం చెబుతోంది. వీలైనంత వరకు ఉదయం పూట, ముఖ్యంగా ‘సింహ లగ్నం’ లేదా ఇతర శుభ లగ్నాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం మంచిది.