News October 28, 2024
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ భాగస్వామి RAILOFY రైళ్లలో ఫుడ్ ఆర్డర్ చేసుకునే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దూర ప్రయాణాలలో దీని ద్వారా పలు రెస్టారెంట్ల నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ముందుగా +917441111266 నంబర్‌కు వాట్సాప్‌లో Hi అని మెసేజ్ చేయాలి. నచ్చిన భాషను ఎంచుకొని వివరాలతో పాటు డెలివరీ స్టేషన్ ఎంచుకోవాలి. సమీపంలో రెస్టారెంట్‌ను సెలక్ట్ చేసి ఆర్డర్ చేస్తే సీటు వద్దకే ఫుడ్ డెలివరీ చేస్తారు.
Similar News
News October 24, 2025
సమ్మె విరమిస్తున్నాం: వైద్య సంఘాలు వెల్లడి

AP: తమ డిమాండ్లను పరిష్కరిస్తామని మంత్రి సత్యకుమార్ స్పష్టమైన హామీలు ఇచ్చినందున సమ్మెను విరమిస్తున్నట్లు పీహెచ్సీ, ఏపీవీవీపీ వైద్యుల సంఘం నేతలు ప్రకటించారు. ఈ మేరకు ఆయన్ను కలిసి మాట్లాడారు. పీజీ మెడికల్ ఇన్ సర్వీసు కోటాను 20%, 2026–27లో 15% కోటాను సాగించేందుకు స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. గతంలో అమల్లో ఉండి నిలిచిన DNB కోర్సుల్లో ప్రవేశాలు, తదితర విషయాల్లోనూ మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు.
News October 24, 2025
శబరిమల గోల్డ్ చోరీ.. అమ్మేశానన్న నిందితుడు

కేరళ శబరిమల అయ్యప్ప ఆలయంలోని బంగారు తాపడాల బరువు తగ్గిన వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వాటి నుంచి 476 గ్రా. బంగారం వేరు చేసి కర్ణాటకలో గోవర్ధన్ అనే వ్యాపారికి అమ్మినట్లు ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ అంగీకరించాడు. సిట్ అధికారుల దర్యాప్తులో దీన్ని గోవర్ధన్ సైతం ధ్రువీకరించాడు. కాగా 2019లో తాపడాలకు మెరుగులు దిద్దే పనిని ఉన్నికృష్ణన్‌కు అప్పగించగా బంగారం బరువు తగ్గిన విషయం ఇటీవల బయటపడింది.
News October 24, 2025
పొలిటికల్ టర్న్ తీసుకున్న వైద్యురాలి ఆత్మహత్య కేసు

MHలో సంచలనం రేపిన వైద్యురాలి <<18091644>>ఆత్మహత్య<<>> కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. పోస్టుమార్టమ్ రిపోర్ట్‌ను ‘మేనేజ్’ చేయాలంటూ డాక్టర్‌పై ఒత్తిడి చేస్తున్నారని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు రాజకీయ నేతలు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్లు మండిపడుతున్నారు. అటు CM ఫడణవీస్ ఆదేశాలతో ప్రధాన నిందితుడు SI గోపాల్‌ను సస్పెండ్ చేశారు.


