News November 19, 2024
రైల్వే ప్రయాణికులకు GOOD NEWS
ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరులోగా 370 రైళ్లకు అదనంగా 1,000 జనరల్ బోగీలను చేర్చనున్నట్లు ప్రకటించింది. దీనివల్ల రోజుకు అదనంగా లక్ష మంది ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చని తెలిపింది. వచ్చే రెండేళ్లలో 10వేలకు పైగా కొత్త నాన్ ఏసీ జనరల్ కోచ్‌లను ప్రవేశపెడతామంది. ఇందులో 4వేల స్లీపర్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని పేర్కొంది.
Similar News
News November 20, 2024
దర్శకుడిగా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మెగా ఫోన్ పట్టుకోనున్నారు. ఆర్యన్ త్వరలో ఓ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించనున్నారు. నెట్‌ఫ్లిక్స్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ సిరీస్ తెరకెక్కనుంది. కొత్త సిరీస్‌తో ఆర్యన్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నట్టు షారుఖ్ తెలిపారు. నెట్‌ఫ్లిక్స్‌లో ముందెన్నడూ లేని విధంగా బాలీవుడ్‌ని ఆస్వాదిస్తారని పేర్కొన్నారు.
News November 20, 2024
దేవుడిలా వచ్చి.. వేల మందిని కాపాడి!
తేలు కాటుకు ఒకప్పుడు విరుగుడు లేకపోవడంతో ఎంతో మంది చనిపోయేవారు. ముఖ్యంగా MHలోని గ్రామీణ ప్రాంతాల్లో 1980లలో మరణాలు పెరగడంతో డా.హిమ్మత్రావ్ బావస్కర్ బాధితులను కాపాడేందుకు ముందుకొచ్చారు. ఆయన కొత్త మిషన్ ప్రారంభించి తేలు చికిత్సపై ప్రయోగాలు చేసి ఫలితం సాధించారు. దీనిని వైద్యులకూ నేర్పించడంతో ప్రజల జీవితాలు మారిపోయాయి. తేలు కాటు మరణాలు 40% నుంచి 1శాతానికి తగ్గాయి. ఆయనను 2022లో పద్మశ్రీ వరించింది.
News November 20, 2024
గెరాల్డ్ కోయెట్జీకి ఐసీసీ హెచ్చరిక
భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్ కోయెట్జీ క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడినట్లు ఐసీసీ తేల్చింది. ఆఖరి టీ20లో తన బౌలింగ్‌లో అంపైర్ వైడ్ ఇచ్చినప్పుడు కోయెట్జీ అసహనం వ్యక్తం చేశారు. అభ్యంతరకర భాషలో అంపైర్‌ను దూషించారంటూ ఫిర్యాదు నమోదైంది. దీంతో అధికారిక హెచ్చరికతో పాటు అతడికి ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చినట్లు ఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. తప్పును కోయెట్జీ అంగీకరించారని తెలిపాయి.