News December 5, 2024
రైల్వే ప్రయాణికులకు తీపి వార్త

ఇకపై ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో 4 జనరల్ బోగీలు జత చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన LHB కోచ్‌లు వీటికి అనుసంధానం చేస్తున్నట్లు వెల్లడించింది. ఒక్కో బోగీలో వంద మంది ప్రయాణించవచ్చని పేర్కొంది. మొత్తం 370 రైళ్లలో వీటిని అందుబాటులోకి తెస్తున్నామని, లక్ష మంది అదనంగా ప్రయాణించవచ్చని వివరించింది. వీటిల్లో ప్రమాదాలు జరిగినా తక్కువ నష్టం కలుగుతుందని పేర్కొంది.
Similar News
News February 4, 2026
U19 ప్రపంచకప్: సెమీస్‌లో అఫ్గాన్‌తో భారత్ ఢీ

U19 ప్రపంచకప్‌లో అజేయంగా దూసుకెళ్తున్న ఆయుష్ మాత్రే సేన సెమీఫైనల్ సమరానికి సిద్ధమైంది. ఈరోజు జరిగే కీలక పోరులో భారత్, అఫ్గాన్‌ను ఢీకొంటుంది. బ్యాటర్లు అభిజ్ఞాన్, సూర్యవంశీ, విహాన్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. హెనిల్, అంబ్రిష్‌ల బౌలింగ్ దళం జట్టుకు ప్రధాన బలం. పాక్‌పై గెలుపుతో రెట్టింపు ఉత్సాహంతో ఉన్న భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఎల్లుండి ఇంగ్లండ్‌తో ఫైనల్ ఆడుతుంది.
News February 4, 2026
రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్

భారత్, చైనాల మధ్య వాణిజ్యం రికార్డు స్థాయికి చేరినట్లు ఆ దేశ దౌత్యవేత్త ఫియాంగ్ వెల్లడించారు. 2025లో $155 బిలియన్ల విలువైన ట్రేడ్ జరిగిందన్నారు. 2024తో పోల్చితే ఇది 12% అధికమన్నారు. పొరుగు దేశాల మధ్య ఆర్థిక సహకారం మెరుగుపడటానికి ఇదొక సంకేతమని చెప్పారు. ‘బ్రిక్స్‌లో IND నేతృత్వానికి మద్దతు ఇస్తాం. ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు.
News February 4, 2026
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈనెల 7, 8 తేదీల్లో ఆయన BJP అభ్యర్థుల విజయానికి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు స్నేహపూర్వక పోటీ చేస్తున్నట్లు జనసేన వర్గాలు స్పష్టం చేశాయి.


