News May 17, 2024
RCB, CSK ఫ్యాన్స్‌కు ఊరటనిచ్చే వార్త

బెంగళూరులో వర్షాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటి వరకు ఆరెంజ్ అలర్ట్ ఉండగా తాజాగా IMD ఎల్లో అలర్ట్‌కు తగ్గించింది. రేపు సాయంత్రం 6.30 నుంచి రాత్రి 10 గంటల వరకు నగరంలో తేలికపాటి వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఆ తర్వాత వర్ష సూచన లేకపోవడం, చిన్నస్వామి స్టేడియంలో సబ్-ఎయిర్ సిస్టమ్ ఉండటంతో RCB, CSK మ్యాచ్ జరిగే అవకాశం ఉందని కర్ణాటక వెదర్ మ్యాన్ పేర్కొన్నారు. ప్రస్తుతం పిచ్‌ను కవర్లతో కప్పేశారు.
Similar News
News February 11, 2026
విశాఖ జిల్లాలో టెన్త్ పరీక్షలు ఎంతమంది రాస్తున్నారంటే?

ఏపీలో మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. విశాఖ జిల్లాలో 475 స్కూల్స్ నుంచి 29,238 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారని DEO ఎన్. ప్రేమ్ కుమార్ తెలిపారు. 133 సెంటర్లను ఏర్పాటు చేయగా.. ఒకసారి ఫెయిల్ అయిన 1305 విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని చెప్పారు. టెన్త్ మార్కుల లిస్ట్ అన్నింటికీ కీలకం కావడంతో అందులో తప్పులు ఉంటే సరి చేసుకోవచ్చని, FEB-12 లోగా HMలను సంప్రదించాలన్నారు.
News February 11, 2026
T20WC: ఐర్లాండ్ ఓటమి

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ ఘోర ఓటమి చవిచూసింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు 16.5 ఓవర్లకు 115 రన్స్ చేసి ఆలౌట్ అయింది. డక్రెల్(41రన్స్) మినహా మిగతా బ్యాటర్లంతా తేలిపోవడంతో ఏ సమయంలోనూ గెలుపు వైపు పయనించలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఎల్లిస్, జంపా తలో 4 వికెట్లు తీశారు. 3.5 ఓవర్లలో 12 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీసిన ఎల్లిస్‌కు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డ్ దక్కింది.
News February 11, 2026
ఎగ్జిట్ పోల్స్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే హవా

TG మున్సిపల్ ఎన్నికల్లో 7కార్పొరేషన్లలో మంచిర్యాల, రామగుండం, నల్గొండ, MBNR, కొత్తగూడెంను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ‘పీపుల్స్ పల్స్’ ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనా వేసింది. NZB, KRNను BJP దక్కించుకుంటుందని, BRS ఒక్క కార్పొరేషన్‌నూ సొంతం చేసుకోలేదని పేర్కొంది. 116మున్సిపాలిటీల్లో INC 68-76, BRS 29-36, BJP 3-5, MIM 0-1, ఇతరులు 8-14 దక్కించుకుంటారని పేర్కొంది. పూర్తి వివరాలు పైన స్లైడ్స్‌లో చూడవచ్చు.


