News December 3, 2024

RTC ఉద్యోగులకు గుడ్ న్యూస్

image

TG: ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని 14 ఆర్టీసీ డిస్పెన్సరీలను యాజమాన్యం ఆస్పత్రులుగా మార్చనుంది. అత్యవసర సేవలు తప్ప మిగతా వైద్యం వీటిల్లోనే అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. కొత్తగా వైద్యుల నియామకం జరగడంతో సాధారణ చికిత్సల కోసం HYD రాకుండా ఆయా జిల్లాల్లోనే అందించనున్నారు. అటు, తార్నాకలోని RTC ప్రధాన ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నవారు సైతం జిల్లా ఆస్పత్రుల్లో మందులు తీసుకునే సౌకర్యాన్ని తీసుకురానున్నారు.

Similar News

News February 14, 2026

ఫిబ్రవరి 14: చరిత్రలో ఈరోజు

image

1898: స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత దిగవల్లి వేంకటశివరావు జననం
1921: ఆంధ్రప్రదేశ్ రెండో సీఎం దామోదరం సంజీవయ్య జననం
1952: మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ జననం
1983: తెలుగు సినిమా హాస్యనటుడు రాజబాబు మరణం(ఫొటోలో)
1984: నటుడు సి.హెచ్. నారాయణరావు మరణం
2019: పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్ల వీరమరణం
☛ ప్రేమికుల దినోత్సవం

News February 14, 2026

విజయ్ ర్యాలీలో కార్యకర్త మృతి.. అన్నాడీఎంకే సెటైర్

image

టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ఎన్నికల ర్యాలీలో విషాదం చోటు చేసుకుంది. సేలంలో సభ జరుగుతున్న సమయంలో గుండెపోటుతో ఓ కార్యకర్త కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా ఈ ఘటనపై అన్నాడీఎంకే నేత సత్యన్ వ్యంగ్యంగా స్పందించారు. టీవీకే ర్యాలీకి వెళ్తే శవపేటిక పట్టుకెళ్లాలని ట్వీట్ చేశారు. అంతకుముందు కరూర్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన సంగతి తెలిసిందే.