News February 7, 2025

SC, ST, BC, మహిళలకు GOOD NEWS

image

AP: SC, ST, BC, దివ్యాంగులు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారికి ఇస్తున్న పెట్టుబడి రాయితీని 35 నుంచి 45 శాతానికి పెంచింది. మొత్తం పెట్టుబడిలో 45% లేదా గరిష్ఠంగా ₹75L రాయితీ లభిస్తుంది. విద్యుత్ రాయితీ యూనిట్‌కు ₹1.50 చొప్పున ఐదేళ్లు ఇవ్వనుంది. SC, STలకు భూమి విలువపై రాయితీని 50 నుంచి 75 శాతానికి, గరిష్ఠంగా ₹25Lకు పెంచింది. ఈ నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

Similar News

News November 11, 2025

రోడ్లపై గుంతలు లేకుండా చేయండి: చంద్రబాబు

image

AP: రోడ్డు ప్రమాదాల నివారణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. హెల్మెట్, సీట్ బెల్టు లేకుండా వాహనం నడుపుతున్న వారికి అవగాహన కల్పించాలని, అవసరమైతే వారి మొబైల్స్‌కి సందేశాలు పంపాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, తొక్కిసలాట, అగ్నిప్రమాదాలు వంటివి జరగకుండా నిర్మాణాత్మక ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. రోడ్లపై గుంతలు లేకుండా యుద్ధప్రతిపాదికన పనులు పూర్తి చేయాలన్నారు.

News November 11, 2025

బిహార్ తుది దశ పోలింగ్‌కు సిద్ధం

image

బిహార్‌లో తుది దశ పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 20 జిల్లాల్లోని 122 స్థానాలకు ఉ.7-సా.6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. బరిలో 1,302 మంది అభ్యర్థులు ఉన్నారు. తొలి దశలో రికార్డు స్థాయిలో 65.08శాతం పోలింగ్ నమోదవ్వగా ఈ సారి అదే కంటిన్యూ అవుతుందా అని ఆసక్తి నెలకొంది. రెండు దశల్లో కలిపి ఈ నెల 14న అధికారులు ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు ప్రకటిస్తారు.

News November 11, 2025

వైద్యుల నిర్లక్ష్యం.. వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు

image

TG: నార్కట్‌పల్లిలో ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్య నిర్లక్ష్యంతో మహిళ మరణించిన కేసులో నల్గొండ జిల్లా వినియోగదారులు ఫోరం సంచలన తీర్పు ఇచ్చింది. బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. నెలలోగా డబ్బు చెల్లించకపోతే 9% వడ్డీతో చెల్లించాలని పేర్కొంది. ఆరెగూడెంకు చెందిన స్వాతి డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరగా వైద్యం వికటించి మరణించింది. దీనిపై బాధిత కుటుంబసభ్యులు ఫోరంను ఆశ్రయించారు.