News February 24, 2025

స్కూలు విద్యార్థులకు శుభవార్త

image

TG: మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశాలు, 7-10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఈ నెల 28వ తేదీతో ముగియనున్న గడువు తేదీని మార్చి 10వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. OC విద్యార్థులు రూ.200, SC, ST, BC, PHC, EWS విద్యార్థులు రూ.125 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

Similar News

News February 24, 2025

బంగ్లాపై న్యూజిలాండ్ ఘన విజయం.. సెమీస్‌కు భారత్

image

ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 237 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 5 వికెట్లు కోల్పోయి 46.1 ఓవర్లలోనే ఛేదించింది. రచిన్ రవీంద్ర (112) సెంచరీతో విజృంభించారు. 12 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో శతకం చేశారు. ఒక దశలో 72/3తో కష్టాల్లో ఉన్న జట్టును రవీంద్ర ఆదుకున్నారు. కాగా ఈ ఫలితంతో పాక్, బంగ్లా టోర్నీ నుంచి నిష్క్రమించగా, భారత్, కివీస్ సెమీస్‌కు దూసుకెళ్లాయి.

News February 24, 2025

తప్పుడు ఏజెంట్లపై పంజాబ్ సర్కార్ ఉక్కుపాదం

image

భారతీయులను అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న 40 మంది ట్రావెల్ ఏజెంట్ల లైసెన్సులను పంజాబ్ సర్కార్ రద్దు చేసింది. 271 మంది ఏజెంట్లకు నోటీసులు జారీ చేసింది. అన్ని ట్రావెల్ కన్సల్టెన్సీ సంస్థల్లో సోదాలు నిర్వహించింది. ప్రయాణికుల రికార్డులు కచ్చితంగా ఉండాలని హెచ్చరించింది. కాగా కొందరు ఏజెంట్లు పలువురు భారతీయులను డంకీ రూట్ ద్వారా US చేర్చారు. ఇటీవల వారిని అమెరికా బంధించి తిరిగి ఇండియాకు పంపింది.

News February 24, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి అభ్యర్థులు వీరేనా?

image

AP: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూటమి తరఫున భారీగా ఆశావహులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐదు ఖాళీలకుగానూ టీడీపీ నుంచి కేఎస్ జవహర్, వంగవీటి రాధా, ఎస్వీఎస్ఎన్ వర్మ, జనసేన నుంచి నాగబాబు, బీజేపీ నుంచి మాధవ్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్చి 3న నోటిఫికేషన్ రానుండగా 20న ఎన్నికలు జరగనున్నాయి.

error: Content is protected !!