News April 20, 2024

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకునే వృద్ధులకు గుడ్‌న్యూస్

image

హెల్త్ ఇన్సూరెన్స్‌పై బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(IRDAI) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలుకు 65 ఏళ్లుగా ఉన్న గరిష్ఠ వయోపరిమితి తొలగించింది. ఇకపై వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా బీమా తీసుకోవచ్చని, ఇది ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు IRDAI తెలిపింది. ముందస్తు వ్యాధుల వెయిటింగ్ పీరియడ్‌ను నాలుగేళ్ల నుంచి మూడేళ్లకు, మారటోరియాన్ని 8 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు తగ్గించింది.

Similar News

News April 5, 2026

ధోనీ రిటైర్మెంట్‌పై అంబటి రాయుడి అంచనా ఇదే!

image

IPLకు ధోనీ రిటైర్మెంట్‌పై అంబటి రాయుడు చేసిన ప్రిడిక్షన్ ఇప్పుడు SMలో వైరలవుతోంది. IPL 2025 సీజన్‌ తర్వాత RCBతో ధోనీ మళ్లీ ఆడే అవకాశం లేదని రాయుడు అంచనా వేశారు. దీంతో పరోక్షంగా ధోనీ కెరీర్‌ ముగిసిందని హింట్ ఇచ్చారని క్రికెట్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అలాగే కోహ్లీ కంటే ముందే ధోనీ IPL నుంచి తప్పుకొంటారన్నారు. CSK స్థాయిలో రాబోయే పదేళ్లలో RCB ట్రోఫీలు గెలిచే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు.

News April 5, 2026

సోషల్ మీడియాలో బూతులు తిడుతున్నారా? జాగ్రత్త!

image

సెలబ్రిటీలు, మహిళలే లక్ష్యంగా SMలో బూతులు తిట్టేవారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల రేణూ దేశాయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరుగురిని అరెస్ట్ చేశారు. SMలో ఫేమస్ అవ్వాలని, యూట్యూబ్‌లో వ్యూస్ కోసమే ఇలా చేసినట్లు పలువురు నిందితులు చెప్పడం గమనార్హం. ఇలాంటి చర్యల వల్ల కెరీర్, వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాక్ స్వాతంత్య్రం హద్దు మీరకూడదంటున్నారు.

News April 5, 2026

IPL హిస్టరీలో ఫాస్టెస్ట్ బాల్స్ ఇవే

image

నిన్న RRతో మ్యాచ్‌లో 154.2km/h వేగంతో(ఈ సీజన్‌లో ఫాస్టెస్ట్ బాల్) బౌలింగ్ చేసి GT యంగ్ బౌలర్ <<19568795>>అశోక్ శర్మ<<>> అదరగొట్టారు. ఐపీఎల్ హిస్టరీలో ఇది పదో వేగవంతమైన బాల్. 157.7km/h వేగంతో షాన్ టైట్ టాప్‌లో ఉన్నారు. ఆ తర్వాత వరుసగా ఫెర్గూసన్(157.3km/h), ఉమ్రాన్ మాలిక్(157km/h), మయాంక్ యాదవ్(156.7km/h, 155.8km/h), ఆన్రిచ్(156.2km/h, 154.8km/h), డేల్ స్టెయిన్(154.4km/h), రబాడ(154.2km/h) ఉన్నారు.