News October 16, 2024

శ్రీవారి భక్తులకు శుభవార్త

image

AP: తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి జనవరి నెల టికెట్ల బుకింగ్‌‌ తేదీలను TTD వెల్లడించింది. రూ.300 దర్శనం టోకెన్లు ఈ నెల 24వ తేదీ ఉ.10 గంటల నుంచి TTD వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. 19 నుంచి 21 వరకు ఆర్జిత సేవా టికెట్లు, 22న కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, 23వ తేదీ అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల కానున్నాయి. 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమలలో గదుల బుకింగ్ ఓపెన్ కానుంది.

Similar News

News November 1, 2025

ఇతిహాసాలు క్విజ్ – 53 సమాధానాలు

image

1. జ్యోతిర్లింగం మొదలు, తుది తెలుసుకోలేని దేవతలు ‘బ్రహ్మ, విష్ణువు’.
2. తారకాసురుని సంహరించింది ‘కార్తికేయ స్వామి’.
3. దక్ష యజ్ఞాన్ని నాశనం చేసిన శివుడి ఉగ్ర రూపం పేరు ‘వీరభద్ర’.
4. శ్రీకృష్ణుడికి బాణం వేసిన వేటగాడి ‘జరా’.
5. పంచభూత స్థలాల్లో భూమి (పృథ్వీ) లింగం ‘కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయం’లో ఉంది.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 1, 2025

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి: సీఎం రేవంత్

image

TG: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కెనడా హై కమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. స్టార్టప్స్, ఎడ్యుకేషన్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్ పెట్టుబడులకు అవకాశాలను పరిశీలించాలని తెలిపారు. ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లామీ బృందమూ సీఎంతో సమావేశమైంది. HYDలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని వారిని రేవంత్ కోరారు. సీఎం నివాసంలోనే ఈ భేటీ జరిగింది.

News November 1, 2025

‘గ్లోబల్ స్టార్’ కాదు ‘మెగా పవర్ స్టార్’

image

రాజమౌళి ‘RRR’ మూవీతో రామ్ చరణ్‌కు గ్లోబల్ స్టార్ ట్యాగ్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘గేమ్ ఛేంజర్‌’లో అదే ట్యాగ్‌ను మేకర్స్ ఉపయోగించారు. అయితే తాజాగా పెద్ది సినిమా పోస్టర్‌లో మెగా పవర్ స్టార్ అని కనిపించడం టీటౌన్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇది మంచి నిర్ణయమని కొందరు అంటున్నారు. ట్యాగ్‌లతో వారి స్టార్‌డమ్‌కు ఎలాంటి డ్యామేజ్ ఉండదని మరికొందరు చెబుతున్నారు. మీరేమంటారు?