News December 29, 2024
విద్యార్థులకు శుభవార్త
AP: గురుకుల విద్యార్థులకు భీమ్ ప్రాజెక్టుతో అత్యుత్తమ వైద్యం అందిస్తామని మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణకు జిల్లాకు ఒక డాక్టర్‌ను నియమించామన్నారు. సింగరాయకొండలో SC, BC వసతి గృహాలను తనిఖీ చేసి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గురుకులాల కోసం 15 రకాల పరికరాలతో హెల్త్ కిట్లు తెస్తున్నామన్నారు. ₹206 కోట్లతో 62 కొత్త హాస్టళ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు.
Similar News
News January 1, 2025
BREAKING: ఫలితాలు విడుదల
వివిధ పరీక్షల ఫలితాలను IBPS రిలీజ్ చేసింది. CRP RRBs ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్-1, ఆఫీసర్ స్కేల్-2, ఆఫీసర్ స్కేల్-2(SO), ఆఫీసర్ స్కేల్-3 ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ఇక్కడ <
News January 1, 2025
దుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు
AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న సీఎంకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జగన్మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటు కొత్త ఏడాది సందర్భంగా దుర్గమ్మ దర్శనానికి భక్తులు బారులు తీరారు.
News January 1, 2025
BJP తప్పులకు మద్దతిస్తారా: RSSకు కేజ్రీవాల్ లేఖ
ఎన్నికలు సమీపించే కొద్దీ ఢిల్లీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గతంలో BJP చేసిన తప్పులకు సంఘ్ మద్దతిస్తుందా అంటూ RSSకు అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ‘BJP నేతలు బాహాటంగా డబ్బులు పంచుతున్నారు. ఓట్ల కొనుగోలుకు సంఘ్ మద్దతిస్తోందా? దళితులు, పూర్వాంచలీ ఓట్లను భారీగా తొలగిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిదేనా? ప్రజాస్వామ్యాన్ని BJP బలహీన పరుస్తోందని RSS భావించడం లేదా’ అని లేఖలో ప్రశ్నించారు.