News January 11, 2025
విద్యార్థులకు శుభవార్త: లోకేశ్
AP: సంక్రాంతి పండుగ వేళ విద్యార్థులకు CM చంద్రబాబు శుభవార్త అందించారని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ‘కంసమామ మోసం చేసి పోతే చంద్రన్న న్యాయం చేస్తున్నారు. జగన్ బకాయిలు పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను విడుదల చేస్తున్నారు. గత పాలకుల పాపాలకు విద్యార్థులు బలి కాకూడదని నేను మంత్రి అయ్యాక విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చే ఏర్పాట్లు చేశాం. రూ.788 కోట్లు చెల్లిస్తున్నాం’ అని లోకేశ్ Xలో ట్వీట్ చేశారు.
Similar News
News January 12, 2025
యువకుల మృతిపై కేసీఆర్ దిగ్భ్రాంతి
TG: కొండ పోచమ్మ సాగర్ డ్యాంలో <<15126886>>ఐదుగురు యువకులు మరణించిన<<>> ఘటనపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనకు బాధ కలిగించిందని తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కాగా మరణించిన వారు హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు.
News January 12, 2025
మళ్లీ వర్షాలు.. రైతుల్లో ఆందోళన
AP: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో రేపటి నుంచి 3రోజులు వర్షాలు కురుస్తాయని IMD ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. పంట చేతికొచ్చే సమయంలో వానల వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని భయపడుతున్నారు. కోతలు పూర్తయిన చోట ధాన్యాన్ని కాపాడుకునేందుకు టార్పాలిన్లను సిద్ధం చేసుకుంటున్నారు. కాగా ప్రకాశం, నెల్లూరు, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
News January 12, 2025
SBI SCO అడ్మిట్ కార్డులు విడుదల
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్టు కేడర్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ ఇంటర్వ్యూ కోసం అడ్మిట్ కార్డులను రిలీజ్ చేసింది. జనవరి 31 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిప్యూటీ మేనేజర్ పోస్టులకు జనవరి 17 నుంచి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు జనవరి 20 నుంచి ఇంటర్వ్యూలు మొదలవుతాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 1497 ఉద్యోగాలను SBI భర్తీ చేస్తోంది. అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ <