News August 21, 2024

విద్యార్థులకు శుభవార్త.. నెలకు రూ.1000 స్కాలర్‌షిప్

image

ఏపీ, TGలోని ప్రభుత్వ, అనుబంధ స్కూళ్లలో చదువుతున్న 8వ క్లాస్ విద్యార్థులు NMMS స్కాలర్‌షిప్‌కు అర్హులు. ప్రైవేట్, కేంద్రీయ, నవోదయ, గురుకులాలు, వసతితో కూడిన స్కూళ్లలో చదివేవారు అనర్హులు. పేరెంట్స్ వార్షికాదాయం ₹3.5లక్షలకు మించకూడదు. 7వ క్లాస్‌లో 55% మార్కులు సాధించి ఉండాలి. ఎంపికైతే 9వ తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ వరకు నెలకు ₹వెయ్యి ఇస్తారు. APలో SEP 6 వరకు, <>TGలో<<>> NOV 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Similar News

News November 21, 2025

రేవంత్ నన్ను అరెస్ట్ చేసే ధైర్యం చేయరు: కేటీఆర్

image

TG: ఫార్ములా ఈ-రేసు <<18337628>>కేసులో<<>> CM రేవంత్ తనను అరెస్ట్ చేసే ధైర్యం చేయరని KTR అన్నారు. ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ కేసులో ఏమీ లేదని రేవంత్‌కూ తెలుసు. నేను ఏ తప్పు చేయలేదు. లై డిటెక్టర్ టెస్టుకూ సిద్ధమే’ అని మీడియా చిట్‌చాట్‌లో స్పష్టం చేశారు. MLA దానం నాగేందర్‌తో రాజీనామా చేయించాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారని, GHMC ఎన్నికల తర్వాత ఉపఎన్నికలు వస్తాయని పేర్కొన్నారు.

News November 21, 2025

SBI పేరిట వెబ్‌సైట్.. పైరసీ సినిమాలు ప్రత్యక్షం!

image

ఎస్బీఐ ఇన్సూరెన్స్ పేరుతో ఉన్న పోర్టల్‌లో పైరసీ సినిమాల లింకులు కనిపించడం కలకలం రేపింది. sbiterminsurance.com పేరిట ఓ పైరసీ వెబ్‌సైట్ వెలుగుచూసింది. అందులో టర్మ్ ఇన్సూరెన్స్ లాప్స్&రివైవల్ గైడ్ పేజీకి రీడైరెక్ట్ అయి సినిమాలు ప్లే అవుతున్నాయి. దీనిపై SBI టీమ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 21, 2025

సెయిల్‌లో 124 పోస్టులు.. అప్లై చేశారా?

image

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SAIL)లో 124 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.sail.co.in