News January 9, 2025

టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్?

image

వన్డే వరల్డ్ కప్‌లో తర్వాత గాయంతో క్రికెట్‌కు దూరమైన మహ్మద్ షమీ తిరిగి జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్‌లో ఆయన రీఎంట్రీ ఇస్తారని క్రిక్ బజ్ కథనం పేర్కొంది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లోనే ఆయన ఆడుతారని భావించినా ఫిట్‌నెస్ లేమితో జట్టులోకి రాలేదు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు బుమ్రాకి రెస్ట్ ఇవ్వడంతో షమీ టీమ్‌లోకి వస్తే భారత బౌలింగ్ పటిష్ఠం కానుంది.

Similar News

News January 9, 2025

TCS షేర్ల‌కు రూ.76 డివిడెండ్‌

image

Q3లో TCS నిక‌ర లాభం 12% పెరిగి ₹12,380 కోట్లుగా న‌మోదైంది. గ‌త ఏడాది ఇదే Dec క్వార్ట‌ర్‌లో లాభం ₹11,058 కోట్లుగా ఉంది. తాజా ఫలితాల వెల్ల‌డి నేప‌థ్యంలో ఒక్కో షేరుకు ₹10 మ‌ధ్యంత‌ర డివిడెండ్‌తోపాటు ₹66 స్పెష‌ల్ డివిడెండ్ చెల్లించ‌నున్న‌ట్టు సంస్థ ప్ర‌క‌టించింది. జనవరి 17ను రికార్డు డేట్‌గా ప్రకటించింది. ఫిబ్రవరి 3న డివిడెండ్ చెల్లించనుంది. ఫలితాల ప్రకటన నేపథ్యంలో గురువారం షేరు ధర 1.57% పతనమైంది.

News January 9, 2025

దిగ్గజ గాయకుడు జయచంద్రన్ మృతి

image

మలయాళ దిగ్గజ గాయకుడు పి జయచంద్రన్(80) ఈరోజు కన్నుమూశారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబీకులు తెలిపారు. ఆరు దశాబ్దాలకు పైగా మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 16వేలకు పైగా పాటలు పాడారు. ఉత్తమ గాయకుడిగా జాతీయ పురస్కారం పొందిన జయచంద్రన్‌కు 5సార్లు కేరళ రాష్ట్ర పురస్కారం, తమిళనాడు నుంచి కలైమామణి అవార్డుతో పాటు నాలుగు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు లభించాయి.

News January 9, 2025

మ‌న్ కీ బాత్ వినాల్సిందే: గోవా ప్ర‌భుత్వం

image

అన్ని ప్ర‌భుత్వ శాఖల ఉన్న‌తాధికారులు త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌ధాన మంత్రి మ‌న్ కీ బాత్ వినాల‌ని గోవా ప్ర‌భుత్వం ఆదేశించింది. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని లేవ‌నెత్తే అంశాలు, స‌ల‌హాల నుంచి స్ఫూర్తి పొందాల‌ని స‌ర్క్యుల‌ర్‌లో పేర్కొంది. ప్ర‌భుత్వ పాల‌న‌ను మెరుగుప‌రిచేందుకు వాటిలో ఉత్త‌మ విధానాల‌ను అమ‌లు చేయాల‌ని సూచించింది. ప్రగతిశీల పాలనా పద్ధతులను అమలు చేయడంలో గోవా మార్గదర్శకమని సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు.