News June 22, 2024
టీమ్ ఇండియా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్!

టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గాయం నుంచి కోలుకున్న ఆయన NCAలో ప్రాక్టీస్ ప్రారంభించారు. సెప్టెంబర్లో బంగ్లాదేశ్తో జరిగే టెస్ట్ సిరీస్ లేదా ఆ తర్వాత న్యూజిలాండ్తో జరిగే సిరీస్లో షమీ ఆడనున్నట్లు సమాచారం. గత ఏడాది వన్డే వరల్డ్ కప్ అనంతరం షమీ శస్త్ర చికిత్స చేయించుకున్నారు. దీంతో IPL, టీ20 WCకు దూరమైన సంగతి తెలిసిందే.
Similar News
News October 15, 2025
మొక్కజొన్న: కోతకు ముందు ఈ జాగ్రత్తలు..

మనుషులతోపాటు కోళ్లు, పశువులకు ఆహారం ఉపయోగించే ప్రధాన పంటల్లో మొక్కజొన్న ఒకటి. పంటను ఆశించే కాండం తొలుచు పురుగు, పేను బంక నివారణకు రైతులు పలు మందులను వాడుతుంటారు. అయితే కోత దగ్గర పడిన సమయంలో అనుమతికి మించి, సురక్షిత కాలాన్ని దాటి వాడటం మంచిది కాదు. వాడితే పంట ద్వారా ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అందుకే పైన ఫొటోలో చూపినట్లుగా సురక్షిత కాలం, మోతాదును పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
News October 15, 2025
అమ్మానాన్నా.. ఎందుకిలా చేస్తున్నారు!

కనిపెంచిన తల్లిదండ్రులే కన్నబిడ్డల ఊపిరి తీస్తున్నారు. కారణమేదైనా.. కాస్తయినా కనికరం లేకుండా కడతేరుస్తున్నారు. TG, APలో జరిగిన 2 సంఘటనలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. నిన్న HYDలో భర్తతో గొడవ కారణంగా భార్య సాయిలక్ష్మి రెండేళ్ల ఇద్దరు కవలలను చంపేసింది. అనంతరం తానూ బిల్డింగ్పై నుంచి దూకి తనువు చాలించింది. ఇవాళ కోనసీమ(D) చిలకలపాడులో భర్త కామరాజు ఇద్దరు పిల్లలను చంపి, బలవన్మరణానికి పాల్పడ్డాడు.
News October 15, 2025
లిక్కర్ స్కాం కేసు.. చెవిరెడ్డికి స్వల్ప ఊరట

ఏపీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. మిగతా నిందితులతో సంబంధం లేకుండా ఆయన బెయిల్పై నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో మిథున్ రెడ్డి బెయిల్పై తుది నిర్ణయం తీసుకునేంతవరకు ట్రయల్ కోర్టు మిగతా వారి బెయిల్ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవద్దన్న హైకోర్టు తీర్పును చెవిరెడ్డి సుప్రీంలో సవాల్ చేశారు.