News September 15, 2024

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్

image

TG: PMFBY కింద రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పంటల బీమాను అందుబాటులోకి తేనుంది. ఇందుకు సంబంధించి ఈ నెలాఖరు వరకు క్లస్టర్ల వారీగా టెండర్లను స్వీకరించనుంది. బీమా ప్రీమియంలో రైతుల వాటా కూడా ప్రభుత్వమే చెల్లించనుంది. ఇందుకోసం రూ.2,500కోట్ల నిధులు అవసరం అవుతాయని అంచనా వేస్తోంది. దాదాపు అన్ని పంటలకు బీమాను వర్తింపజేయనున్నట్లు సమాచారం. అయితే ఏ సీజన్ (ఖరీఫ్ORరబీ) నుంచి అమలు చేస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది.

Similar News

News December 4, 2025

విశాఖకు మరిన్ని డేటా సెంటర్లు

image

AP: విశాఖకు మరిన్ని డేటా సెంటర్లు రాబోతున్నాయి. ప్రముఖ IT సంస్థ కంట్రోల్-ఎస్ విశాఖలో 350MW డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. దీంతో పాటు మరో 2 కంపెనీలు నిన్న విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుకు స్థలాలు పరిశీలించాయి. భూములపై కంపెనీలు సానుకూల ప్రతిపాదనలిస్తే క్యాబినెట్ భేటీలో కేటాయింపులపై ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. ఇప్పటికే గూగుల్ 1 గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.

News December 4, 2025

నేడు మార్గశిర పౌర్ణమి.. ఏం చేయాలంటే?

image

మార్గశిర మాసంలో గురువారాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. నేడు ఈ వారం పౌర్ణమి తిథితో కలిసి వచ్చింది. కాబట్టి నేడు లక్ష్మీదేవితో పాటు చంద్రున్ని కూడా పూజిస్తే విశేష ఫలితాలుంటాయని పండితులు అంటున్నారు. ఈరోజు లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే అష్టలక్ష్మీ వైభవం కలుగుతుందని, చంద్రుడికి అర్ఘ్యం సమర్పిస్తే మానసిక శాంతి లభిస్తుందని చెబుతున్నారు. ☞ ఈ వ్రతాలు ఎలా, ఏ సమయంలో చేయాలో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News December 4, 2025

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>) కోట్‌ద్వారా యూనిట్‌లో 14 ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్ C పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు ఈ నెల 23 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, టెన్త్, ITI, అప్రెంటిషిప్ ఉత్తీర్ణులైన, 28ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష (CBT) ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in/