News September 7, 2024
టెన్త్ ఫెయిలైన వారికి గుడ్ న్యూస్

AP: టెన్త్ క్లాస్ 2022, 2023, 2024 బ్యాచ్ ఫెయిలైన విద్యార్థులకు పాత సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ ఏడాది పదో తరగతి సిలబస్‌లో మార్పులు జరగడం, సీబీఎస్ఈ సిలబస్‌ను అమలు చేస్తుండటంతో పాత విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. దీంతో అధికారులు క్లారిటీ ఇచ్చారు. వారు చదువుకున్న సిలబస్‌తోనే ఎగ్జామ్స్ ఉంటాయని తెలిపారు.
Similar News
News October 29, 2025
రేవల్లిలో అత్యధిక వర్షపాతం నమోదైన

రెండు రోజులకు కురుస్తున్న వర్షాలకు వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో 123.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గోపాల్పేట్ 94.6, ఘనపూర్ 73.4, వనపర్తి 68.0, వీపనగండ్ల 63.2, చిన్నంబావి 58.4, పెద్దమందడి 51.8, పానగల్ 46.8, శ్రీరంగాపూర్ 40.4 , పెబ్బేరు 39.0, కొత్తకోట 33.4, మదనాపూర్ 32.2, ఆత్మకూరు 18.4, అమరచింతలో 12.4 వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.
News October 29, 2025
మహిళలు ఎక్కువ ఒత్తిడికి గురయ్యేది ఇందుకే!

తాను పనిచేస్తుంటే హెల్ప్ చేయకుండా ఫోన్ చూస్తూ విశ్రాంతి తీసుకుంటున్న భర్తను చూసి మహిళలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు ఓ పరిశోధనలో వెల్లడైంది. ఇది ఉద్యోగం కంటే కూడా ఎక్కువ స్ట్రెస్ ఇస్తుందని తేలింది. ఇంటి పనులు, వంట, పిల్లల సంరక్షణతో మహిళల్లో కార్టిసాల్ (ఒత్తిడి హార్మోన్) స్థాయులు పెరుగుతాయి. ఇది సోమరితనం కాదని, బాధ్యతల్లో అసమతుల్యత అని నిపుణులు చెబుతున్నారు. *ఇంట్లో భార్యకు హెల్ప్ చేయండి బాస్
News October 29, 2025
భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 110 అప్రెంటిస్‌లు

సంగారెడ్డిలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (<


