News November 5, 2024
సామాన్యులకు ప్రభుత్వం గుడ్న్యూస్!

AP: భారీగా పెరిగిన నిత్యావసర ధరలతో సతమతం అవుతున్న సామాన్యులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. సబ్సిడీ ధరలపై సరకులు అందజేసేందుకు సిద్ధమవుతోంది. లీటర్ పామాయిల్ రూ.110, కేజీ కందిపప్పు రూ.67, అరకేజీ చక్కెర 16 రూపాయలకే అందించాలని మంత్రులు నాదెండ్ల, పయ్యావుల, అచ్చెన్నాయుడుతో కూడిన కమిటీ నిర్ణయించింది. రైతు బజార్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 2200 రిటైల్ ఔట్లెట్ల ద్వారా సరకులు విక్రయించనుంది.
Similar News
News January 17, 2026
గ్రీన్లాండ్ విషయంలోనూ టారిఫ్ అస్త్రం

గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతో US అధ్యక్షుడు ట్రంప్ మరోసారి టారిఫ్ అస్త్రాన్ని ఉపయోగించనున్నారు. ఈ విషయంలో అమెరికాకు మద్దతు ఇవ్వని దేశాలపై భారీ సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. గతంలో టారిఫ్ బెదిరింపులతో యూరప్ దేశాలను ఒప్పించిన విషయాన్ని గుర్తు చేశారు. అదే వ్యూహాన్ని గ్రీన్లాండ్ విషయంలోనూ అమలు చేస్తానని ట్రంప్ స్పష్టం చేశారు.
News January 17, 2026
అత్త యేలిన కోడలూ, చిత్త పట్టిన చేనూ

పూర్వకాలంలో, అత్త ఇంటి వ్యవహారాలను, కోడలి ప్రవర్తనను, పనులను దగ్గరుండి పర్యవేక్షించేవారు. ఆ పర్యవేక్షణ, క్రమశిక్షణ వల్ల కోడలు ఇంటి పనులన్నీ నేర్చుకుని సమర్థవంతంగా వ్యవహరించేదని, దాని వల్ల ఆ ఇల్లు చక్కగా ఉండేదని నమ్మేవారు. అలాగే రైతు తన మనసు పెట్టి, ఇష్టంగా, శ్రద్ధగా సాగు చేసుకునే పొలం మంచి దిగుబడిని, ఫలితాన్ని ఇస్తుంది. ఏదైనా ఒక పనిని అంకిత భావంతో చేస్తే మంచి ఫలితం వస్తుందని ఈ సామెత చెబుతుంది.
News January 17, 2026
నేడు ప్రయాణాలు చేయవచ్చా?

కనుమ రోజు ఊరు దాటొద్దనే సంప్రదాయం ఉంది. అందుకే ఇంటికొచ్చిన ఆడపడుచులను తిరిగి పంపరు. కానుకలు ఇచ్చి గౌరవంగా చూసుకుంటారు. ఇక ముక్కనుమ విషయానికి వస్తే ప్రయాణాలకు అనువైన రోజని పండితులు చెబుతున్నారు. అయితే కొందరు ఈరోజు కూడా పండుగ వాతావరణం ఉంటుందని బయలుదేరడానికి సంకోచిస్తుంటారు. కానీ ముక్కనుమ నాడు ప్రయాణాలు చేయకూడదని ఎటువంటి శాస్త్ర నియమాలు లేవు. కాబట్టి కనుమ నాడు ఆగి, ముక్కనుమ రోజున ప్రయాణాలు చేయవచ్చు.


