News September 23, 2025
శ్రీవారి సేవకులకు శుభవార్త

AP: తిరుమల శ్రీవారి సేవకులకు TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు శుభవార్త చెప్పారు. సేవా కాలం ముగిసిన అనంతరం వారికి మెరుగైన స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఈ విషయంపై బోర్డు సమావేశంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల భక్తులు శ్రీవారి సేవ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని తెలిపారు. శ్రీవారి సేవకులు భగవద్బంధువులు అని పేర్కొన్నారు.
Similar News
News September 23, 2025
పవన్ కళ్యాణ్‌కు వైరల్ ఫీవర్

AP: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారినపడ్డారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గత రెండు రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతున్నారని, ఫీవర్‌తోనే నిన్న అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారని తెలిపాయి. నిన్న రాత్రి నుంచి జ్వరం తీవ్రత పెరిగిందని, వైద్యులు పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నాయి. విశ్రాంతి అవసరమని సూచించారని వివరించాయి.
News September 23, 2025
ఇంద్రకీలాద్రిపై కోరినన్ని లడ్డూలు: కలెక్టర్

AP: దసరా ఉత్సవాలకు విజయవాడ దుర్గగుడిలో అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. ప్రసాద తయారీ కేంద్రాలను తనిఖీ చేశారు. ‘భక్తులు కోరినన్ని లడ్డూలను ప్రసాదంగా అందించేందుకు ఏర్పాట్లు చేశాం. 11 రోజులకు 36 లక్షల లడ్డూలు సిద్ధం చేశాం. రైల్వేస్టేషన్, బస్టాండ్ వంటి ప్రాంతాల్లో విక్రయ కేంద్రాలున్నాయి. మూలా నక్షత్రం రోజున ఉచితంగా ప్రసాదం పంపిణీ చేస్తాం’ అని తెలిపారు.
News September 23, 2025
హైకోర్టును ఆశ్రయించిన స్మితా సబర్వాల్

TG: ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ హైకోర్టును ఆశ్రయించారు. ‘కాళేశ్వరం’ ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టులో తన పేరును తొలగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఆమె సీఎంవో సెక్రటరీగా, నీటిపారుదల శాఖ ఇన్‌ఛార్జి కార్యదర్శిగా పనిచేశారు. గత ఏడాది పీసీ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం అనారోగ్యం కారణంగా దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు.