News July 24, 2024

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? నాణ్యమైన స్టడీ మెటీరియల్‌ ఉచితంగా కావాలా? <>sathee.prutor.ai<<>> వెబ్‌సైట్‌, SATHEE యాప్‌ను ఐఐటీ కాన్పూర్ తీసుకొచ్చింది. ప్రాక్టీస్ టెస్ట్స్, వీడియో లెక్చర్స్, నోటిఫికేషన్స్ అన్నీ వీటి ద్వారా లభిస్తాయి. నీట్, జీ, సీపీఓ ఎస్సై వంటి పలు పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ కూడా దొరుకుతుంది. ఇది కేంద్రం ఆధ్వర్యంలోనే నడుస్తుండటం విశేషం.

Similar News

News October 14, 2025

50% పరిమితి రాజ్యాంగంలో లేదు: ప్రభుత్వం

image

TG: SCలో దాఖలు చేసిన <<17999644>>పిటిషన్‌<<>>లో ప్రభుత్వం పలు అంశాలను ప్రస్తావించింది.
* రిజర్వేషన్లపై 50% పరిమితి ఉన్నట్లు రాజ్యాంగంలో లేదు. * ప్రత్యేక సందర్భాల్లో రిజర్వేషన్లు ఇవ్వొచ్చని గతంలో SC చెప్పింది. * సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే 2024-25లో రాష్ట్ర జనాభాలో 56.33% మంది బీసీలున్నారు. * శాసనసభలో ఆమోదించి పంపిన బిల్లులను 3నెలల్లో గవర్నర్, రాష్ట్రపతి ఆమోదించకపోతే ఓకే చేసినట్లే.

News October 14, 2025

ఈ మూడు దగ్గు సిరప్‌లు డేంజర్: WHO

image

భారత్‌లోని 3 ఫార్మా కంపెనీలకు చెందిన కాఫ్ సిరప్‌లను వాడొద్దని WHO హెచ్చరించింది. ఇందులో ఇటీవల 22 మంది పిల్లల మరణానికి కారణమైన శ్రేసన్ ఫార్మా ‘కోల్డ్రిఫ్’ కూడా ఉంది. దాంతో పాటు రెడ్‌నెక్స్ ఫార్మా ‘రెస్పిఫ్రెష్ TR’, షేప్ ఫార్మా ‘రీలైఫ్’ సిరప్‌లు ఆరోగ్యానికి హానికరమని పేర్కొంది. కాగా ఈ దగ్గు మందులు ఇతర దేశాలకు ఎగుమతి కాలేదని ఇండియన్ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ WHOకు తెలిపింది.

News October 14, 2025

MCTEలో 18 పోస్టులు

image

క్యాడెట్స్ ట్రైనింగ్ వింగ్ ఆఫ్ మిలటరీ కాలేజీ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (MCTE)18 అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంఈ, ఎంఎస్, MSc, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈనెల 31 వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు.