News December 3, 2024
నిరుద్యోగులకు శుభవార్త

TG: నిరుద్యోగులు, కంపెనీలకు మధ్య వారధిలా ఉండేలా డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ(డీట్) వెబ్సైటును పరిశ్రమల శాఖ సిద్ధం చేసింది. CM రేవంత్ రెడ్డి రేపు దీనిని ప్రారంభిస్తారు. కంపెనీల్లోని ఉద్యోగ అవకాశాలు, అప్రెంటీస్షిప్, ఇంటర్న్షిప్ల వివరాలు దీనిలో అందుబాటులో ఉంటాయి. నిరుద్యోగులు, డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న వారు ఈ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకుంటే, కంపెనీలే నేరుగా ఎంపిక చేస్తాయి.
Similar News
News January 22, 2026
5 ఏళ్లలో 14.88 లక్షల మందికి కుక్కకాట్లు

TG: పల్లె నుంచి పట్నం వరకు కుక్క కాట్ల ఘటనలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో 5 ఏళ్లలో ఏకంగా 14,88,781 మంది కుక్క కాట్లకు గురయ్యారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ RTI ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించింది. 2020-2025 మధ్య కుక్క కాటుకు గురైన వారి సంఖ్యను తెలిపింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా 36,07,989 రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు పేర్కొంది. 21,466 మంది పాము కాటుకు గురయ్యారంది.
News January 22, 2026
28,740 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎప్పుడంటే?

ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ నెల 31న మెగా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 28,740 గ్రామీణ డాక్ సేవక్(GDS), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ABPM) ఖాళీలను భర్తీ చేయనుంది. AP, TGలో దాదాపు 2వేల జాబ్స్ ఉండే అవకాశం ఉంది. టెన్త్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తుంది. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.100.
వెబ్సైట్: <
News January 22, 2026
విటమిన్ B12 లోపాన్ని నిర్లక్ష్యం చేయకండి

రోజంతా అలసట, మూడ్ స్వింగ్స్, మర్చిపోవడం వంటివి సాధారణ సమస్యలే అనుకుంటున్నారా? కానీ ఇవి విటమిన్ B12 లోపానికి హెచ్చరికలు కావచ్చు. భారత్లో 15 శాతం కంటే ఎక్కువ మందికి ఈ లోపం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. B12 తక్కువైతే అలసట, నరాల బలహీనత, నడవడంలో ఇబ్బంది, నోటిలో పుండ్లు, దృష్టి సమస్యలు, రక్తహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. మాంసాహారం, చేపలు, గుడ్లు, పాలు తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని నివారించవచ్చు.


