News December 19, 2024

నిరుద్యోగులకు శుభవార్త

image

AP: నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగాలు కల్పించేలా ట్రెయిన్ అండ్ హైర్ ప్రోగ్రామ్‌ను ఏపీ <>నైపుణ్యాభివృద్ధి సంస్థ <<>>నిర్వహిస్తోంది. దీని ప్రకారం కంపెనీలే నిరుద్యోగులకు ఎలాంటి ఫీజు తీసుకోకుండా శిక్షణ ఇచ్చి, ఆ సంస్థలో లేదంటే అనుబంధ సంస్థలో ఉద్యోగాలు కల్పిస్తాయి. యూనివర్సిటీలు, కాలేజీల్లో శిక్షణ ఇచ్చే సంస్థలకు స్థలం కేటాయించడం, మ్యాన్ పవర్‌ను అందించడంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ సాయం చేస్తుంది.

Similar News

News November 27, 2025

నారాయణపేట జిల్లాలో 69 సర్పంచ్ నామినేషన్లు

image

నారాయణపేట జిల్లాలోని నాలుగు మండలాల్లో గురువారం 67 గ్రామ పంచాయతీలకు గాను, సర్పంచ్ పదవులకు 69 నామినేషన్లు, 572 వార్డులకు 38 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా కొత్తపల్లి మండలంలో సర్పంచ్ పదవులకు 26 నామినేషన్లు రాగా.. వార్డులకు 8 నామినేషన్లు వచ్చాయి. కోస్గిలో 19, 25, మద్దూరులో 16, 4, గుండుమల్‌లో 8, 1.. సర్పంచ్, వార్డులకు నామినేషన్లు దాఖలయ్యాయి.

News November 27, 2025

స్కిల్స్ లేని డిగ్రీలెందుకు: స్టూడెంట్స్

image

మారుతున్న ఉద్యోగ మార్కెట్‌కు అనుగుణంగా అకడమిక్ సిలబస్‌లో మార్పులు తీసుకురావాలని కొందరు విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాలేజీ దశలోనే నైపుణ్య ఆధారిత కోర్సులు, ఉద్యోగ కోచింగ్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. నైపుణ్యం లేని డిగ్రీలతో బయటకు వస్తే ఉద్యోగాలు దొరకడం లేదని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అందుకే ఉద్యోగం ఇప్పిస్తామని <<18402171>>మోసం<<>> చేసేవారు పెరుగుతున్నారన్నారు. మీ కామెంట్?

News November 27, 2025

7,948 MTS, హవల్దార్ పోస్టులు

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<>SSC<<>>) 7,948 MTS(నాన్ టెక్నికల్), హవల్దార్ ఖాళీల వివరాలను రీజియన్ల వారీగా ప్రకటించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్&కస్టమ్స్ (CBIC), సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్‌(CBN)లో ఈ పోస్టులు ఉన్నాయి. వీటిలో ఏపీలో 404, తెలంగాణలో169 పోస్టులు ఉన్నాయి. గతంలో 5,464 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. తాజాగా పోస్టులను జత చేసింది. త్వరలో పరీక్ష షెడ్యూల్‌ను ప్రకటించనుంది.