News January 8, 2025
నిరుద్యోగులకు శుభవార్త
నిరుద్యోగులకు TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మార్చి 31లోపు పెండింగ్‌లో ఉన్న నోటిఫికేషన్ల ఫలితాలు ఇస్తామన్నారు. కొత్త నోటిఫికేషన్లు మే 1 నుంచి జారీ చేస్తామని పేర్కొన్నారు. పరీక్ష ఫలితాలు ఎలాంటి ఆలస్యం లేకుండా ఇస్తామన్నారు. వారం, పది రోజుల వ్యవధిలో గ్రూప్-1, 2, 3 ఫలితాలు రిలీజ్ చేస్తామని ప్రకటించారు. యూపీఎస్సీ, SSC ఫార్మాట్లో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
Similar News
News January 9, 2025
ముగిసిన కేటీఆర్ విచారణ
TG: ఫార్ములా-ఈ రేసు కేసులో మాజీ మంత్రి KTRపై ఏసీబీ అధికారుల విచారణ ముగిసింది. అనుమతులు, నిధుల బదీలీ వంటి అంశాలపై ఆయన్ను అధికారులు సుమారుగా 7 గంటల పాటు ప్రశ్నించారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్, ఏసీపీ, సీఐ ఈ విచారణలో పాల్గొన్నారు. కేటీఆర్ తరఫు న్యాయవాదిని పక్క గది వరకు అనుమతించారు.
News January 9, 2025
ఇందిరమ్మ ఇళ్లపై BIG UPDATE
TG: ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గ్రీవెన్స్ మాడ్యూల్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సచివాలయంలో ప్రారంభించారు. ఇళ్ల ఎంపికలో ఏమైనా సమస్యలు ఎదురైతే <
News January 9, 2025
సీఎం చంద్రబాబుతో టీటీడీ ఛైర్మన్ భేటీ
AP: సీఎం చంద్రబాబుతో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సమావేశమయ్యారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో జరుగుతున్న ఈ భేటీలో నిన్న రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధానంగా చర్చిస్తున్నారు. అలాగే రానున్న రోజుల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్లు జారీ చేసే ప్రక్రియలో మార్పులు చేసే అవకాశం ఉంది. ఈ సమావేశంలో టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీ, టీటీడీ జేఈవోలు పాల్గొన్నారు.