News October 9, 2025
నిరుద్యోగులకు శుభవార్త.. గరిష్ఠ వయోపరిమితి పెంపు

AP: నాన్ యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని ప్రభుత్వం 34 నుంచి 42 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. యూనిఫామ్ పోస్టులకు మాత్రం రెండేళ్లు పొడిగించింది. 2026, సెప్టెంబర్ 30 వరకు ఈ వయో సడలింపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక నుంచి APPSC, ఇతర రిక్రూట్‌మెంట్ సంస్థల ద్వారా చేపట్టే నియామకాల్లో ఈ వయోపరిమితి అమలవుతుందని తెలిపింది.
Similar News
News October 9, 2025
2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన సాధ్యమేనా?

బడ్జెట్, ఆర్థిక కారణాలతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఏ రాష్ట్రంలోనైనా నెమ్మదిగా ఉంటుంది. వేలల్లో భర్తీకే ఏళ్లు పడతాయి. అలాంటిది తాము ప్రతి ఇంటికి <<17957773>>ఓ ఉద్యోగం<<>> ఇస్తామని తేజస్వీ యాదవ్ ప్రకటించడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. బిహార్‌లో 2.9కోట్ల కుటుంబాలున్నాయని, హామీ ఆచరణ సాధ్యమేనా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఎన్నికల వేళ కొండ మీది కోతినైనా తెస్తామని నేతలు చెబుతారని పలువురు విమర్శిస్తున్నారు.
News October 9, 2025
రష్యా ఆయిల్.. చైనా కరెన్సీలో ఇండియా చెల్లింపులు!

ఇండియాతో ఆయిల్ బిజినెస్ విషయంలో రష్యా కొత్త పంథా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కొనుగోళ్లకు సంబంధించిన పేమెంట్స్‌ను చైనా కరెన్సీ ‘యువాన్’తో చేయాలని భారత్‌ను రష్యా ట్రేడర్లు కోరినట్లు ‘రాయిటర్స్’ వెల్లడించింది. కనీసం 3 రష్యన్ షిప్‌మెంట్స్‌కు యువాన్స్‌తో IOC పేమెంట్ చేసినట్లు సమాచారం. ట్రంప్ టారిఫ్‌ల నేపథ్యంలో డాలర్లు, యూఏఈ దిర్హామ్స్‌తో ఇబ్బందులు తలెత్తకుండా ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది.
News October 9, 2025
కోనసీమ దుర్ఘటన.. విచారణకు ఉన్నతస్థాయి కమిటీ

AP: కోనసీమ(D) రాయవరంలో బాణసంచా పేలి 8 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తునకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్ నేతృత్వంలో ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. పేలుడుకు గల కారణాలు, బాధ్యులను గుర్తించాలని ఆదేశించింది. విచారణ అధ్యయన నివేదికను వారంలోగా సమర్పించాలని ఆదేశించింది.