News December 31, 2024
సంక్రాంతికి ఊరెళ్లేవారికి గుడ్ న్యూస్

సంక్రాంతికి ఊరెళ్లేవారికి TGSRTC గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం 6432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించినట్లు సంస్థ ప్రకటించింది. ఇందులో 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించింది. జనవరి 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ ఈ స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయంది. సంక్రాంతి బస్సుల్లోనూ మహాలక్ష్మి పథకం అమల్లో ఉంటుందని, జీరో టికెట్ తీసుకోవాలని సూచించింది.
Similar News
News December 2, 2025
సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (<
News December 2, 2025
NDAలోకి విజయ్ దళపతి?

తమిళనాడులో NDA కూటమిలోకి TVK చీఫ్ విజయ్ చేరుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుతో పోటీ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. పొత్తు ఉండొచ్చని అన్నాడీఎంకే చీఫ్ <<17963359>>పళనిస్వామి <<>>గతంలో సంకేతాలిచ్చారు. అయితే కూటమిలో చేరుతున్నామనే వార్తలను TVK ఖండిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటే కూటమిగా వెళ్తేనే బెటర్ అని భావిస్తున్నట్లు సమాచారం.
News December 2, 2025
లేటెస్ట్ అప్డేట్స్

* సచివాలయంలో విద్యుత్, మైనింగ్ శాఖలపై సమీక్ష నిర్వహించనున్న సీఎం చంద్రబాబు
* కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ వర్సిటీని ప్రారంభించనున్న సీఎం రేవంత్
* హైదరాబాద్లో మరోసారి ఐటీ అధికారులు సోదాలు.. వుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమానిని విచారించిన అధికారులు.. షాగౌస్, పిస్తా హౌస్, మెహిఫిల్ హోటళ్లతో సంబంధాలపై ఆరా
* కువైట్-హైదరాబాద్ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ముంబై విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్


