News December 8, 2024

శబరిమల వెళ్లే వారికి శుభవార్త

image

శబరిమల వెళ్లే వారి కోసం SCR 34 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. జనవరిలో తిరిగే ఈ రైళ్లు హైదరాబాద్-కొట్టాయం, కొట్టాయం-సికింద్రాబాద్, మౌలాలి-కొట్టాయం, కాచిగూడ-కొట్టాయం, మౌలాలి-కొల్లం మధ్య వివిధ తేదీల్లో రాకపోకలు సాగించనున్నాయి. రైళ్లు ప్రయాణించే తేదీలు, హాల్టింగ్ వివరాలను పైన ఫొటోల్లో చూడవచ్చు.

Similar News

News December 3, 2025

పిల్లల జీవితానికి ఈ అలవాట్లే పునాదులు

image

చిన్నతనంలోనే పిల్లలకు కొన్ని అలవాట్లు నేర్పిస్తే వారిలో ప్రశాంతతతోపాటు క్రమశిక్షణ, ఏకాగ్రత, జీవన నైపుణ్యాలు మెరుగవుతాయంటున్నారు నిపుణులు. ఉదయాన్నే త్వరగా నిద్ర లేవడం, బెడ్ సర్దడం, తమంతట తామే రెడీ కావడం, వ్యాయామం, క్లీనింగ్, గార్డెనింగ్ చేయించడం వల్ల వారిలో ఉత్పాదకత పెరుగుతుందని చెబుతున్నారు. వీటితో పాటు పుస్తకాలు చదవడం, కృతజ్ఞతాభావం అలవాటు చేయడం వారికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయంటున్నారు.

News December 3, 2025

19 దేశాలపై మరిన్ని ఆంక్షలు విధించిన ట్రంప్

image

సిటిజన్‌షిప్, గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్‌తోపాటు అన్ని ఇమ్మిగ్రేషన్ అప్లికేషన్ల స్వీకరణను అమెరికా తాత్కాలికంగా నిలిపివేసింది. అఫ్గానిస్థాన్, సోమాలియా సహా 19 నాన్ యూరోపియన్ దేశాలపై ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. నేషనల్ సేఫ్టీ, ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. US నేషనల్ గార్డుపై అఫ్గానిస్థాన్ పౌరుడు దాడి చేసిన నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.

News December 3, 2025

వన్యప్రాణులతో పొలాలకు పెరుగుతున్న ముప్పు

image

తెలుగు రాష్ట్రాల్లో పంట పొలాలకు వన్యప్రాణుల ముప్పు పెరుగుతోంది. AP, తెలంగాణలో 90% పంట పొలాలకు కోతుల సమస్య, 50% పొలాలకు అడవి పందుల సమస్య ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. TG లోని గద్వాల్, MBNR, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో కృష్ణ జింకలతో.. APలోని అనేక జిల్లాల్లో కోతులు, అడవి పందులు, కృష్ణజింకలు, దుప్పులతో పాటు చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో అదనంగా ఏనుగులతో పంట పొలాలకు నష్టం వాటిల్లుతోంది.