News September 14, 2024

UPI పేమెంట్లు చేసే వారికి శుభవార్త

image

కొన్ని UPI లావాదేవీలకు ఒకేసారి రూ.5లక్షల వరకు చెల్లింపులు చేసే సదుపాయం రేపటి(సెప్టెంబర్ 15) నుంచి అందుబాటులోకి రానుంది. ఇటీవల జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఈ నిర్ణయానికి RBI ఆమోదం తెలపగా, తాజాగా NPCI ఇందుకు అనుమతిచ్చింది. ఆదాయపు పన్ను చెల్లింపులు, ఆసుపత్రి, విద్యాసంస్థల బిల్లులు, IPO దరఖాస్తులు, ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలుకు UPI ద్వారా ఒకేసారి రూ.5లక్షల చెల్లింపులు చేయవచ్చు.

Similar News

News January 19, 2026

యాదాద్రి జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి పర్యటన

image

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9:30కు యాదగిరిగుట్ట స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం సైదాపురంలో అంగన్‌వాడీ భవనాలు, సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేస్తారు. యాదగిరిగుట్ట, ఆలేరులో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్నం 1:30కు మాటూరులో సబ్ స్టేషన్ పనులను ప్రారంభిస్తారు.

News January 19, 2026

నాకు పెళ్లి కాలేదు: డింపుల్ హయాతి

image

తనకు పెళ్లి అయినట్లు జరుగుతున్న ప్రచారాన్ని హీరోయిన్ డింపుల్ హయాతి ఖండించారు. ‘ఆమెకు ఆల్రెడీ పెళ్లి అయింది’ అని ఓ నెటిజన్ SMలో కామెంట్ చేయగా ‘నాకు పెళ్లి కాలేదు’ అంటూ ఆమె రిప్లై ఇచ్చారు. డింపుల్, ఆమె భర్త డేవిడ్‌పై పోలీస్ కేసు నమోదైందంటూ సదరు నెటిజన్ ఓ న్యూస్ ఆర్టికల్‌ను షేర్ చేయగా అది ఫేక్ అని ఆమె బదులిచ్చారు. కాగా డింపుల్ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ సంక్రాంతికి థియేటర్లలో విడుదలైంది.

News January 19, 2026

2030 కల్లా అప్పర్ మిడిల్ క్లాస్ దేశంగా భారత్: SBI

image

భారత్ ఆర్థికంగా జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోందని SBI తాజా రిపోర్ట్ వెల్లడించింది. 2028 కల్లా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని తెలిపింది. 2030నాటికి ‘అప్పర్ మిడిల్ ఇన్‌కమ్’ దేశాల క్లబ్‌లో చేరనుందని పేర్కొంది. అప్పటికీ మన తలసరి ఆదాయం $4,000 (దాదాపు రూ.3,63,541) మార్కును తాకడం ఖాయమని అంచనావేసింది. 2047నాటికి ‘అభివృద్ధి చెందిన దేశం’గా భారత్ గ్లోబల్ లీడర్‌గా నిలవనుందని తెలిపింది.