News October 15, 2025
గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైనవారికి గుడ్‌న్యూస్

తెలంగాణలో గ్రూప్ -2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అక్టోబర్ 18న సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేయనున్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగే కార్యక్రమంలో 782 మందికి ఆయన అపాయింట్‌మెంట్ లెటర్స్ అందజేస్తారు. ఇందుకుగానూ టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 28న టీజీపీఎస్సీ గ్రూప్-2 తుది ఫలితాలు వెల్లడించిన విషయం తెలిసిందే.
Similar News
News October 16, 2025
సృష్టిలో శివ-శక్తి స్వరూపం

శివలింగాలు ప్రధానంగా 2 రకాలు. అవి స్థావరలింగం, జంగమ లింగం. చెట్లు, లతలు స్థావర లింగాలు కాగా, క్రిమి కీటకాదులు జంగమ లింగాలు. స్థావర లింగాన్ని నీరు పోసి సంతోషపెట్టాలి. జంగమ లింగాన్ని ఆహార వస్తువులతో తృప్తిపరచాలి. ఇదే నిజమైన శివ పూజ. సర్వత్రా ఉన్న పీఠం దేవి స్వరూపం. లింగం సాక్షాత్తూ చిన్మయ స్వరూపం. ఇలా సృష్టిలోని ప్రతి అంశంలోనూ శివ-శక్తి స్వరూపాన్ని గుర్తించి, సేవించడమే ఉత్తమ పూజా విధానం. <<-se>>#SIVOHAM<<>>
News October 16, 2025
రాష్ట్రంలో 218 పోస్టులు… అప్లై చేశారా?

ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్ 218 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వీటిలో సీనియర్ రెసిడెంట్స్ పోస్టులు 97 ఉండగా, ఫ్యాకల్టీ పోస్టులు 121 ఉన్నాయి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. సీనియర్ రెసిడెంట్ పోస్టులకు ఈ నెల 21, ఫ్యాకల్టీ పోస్టులకు ఈ నెల 26 దరఖాస్తుకు ఆఖరు తేదీ. వెబ్‌సైట్: https://www.aiimsmangalagiri.edu.in/
News October 16, 2025
జగన్ సొంత ఫోన్ నంబర్ ఇవ్వలేదు: సీబీఐ

AP: విదేశీ పర్యటనకు వెళ్లిన YCP చీఫ్ జగన్ తన సొంత ఫోన్ నంబర్ కాకుండా మరొకరిది ఇచ్చారని సీబీఐ అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆయన పర్యటన అనుమతిని రద్దు చేయాలని కోరారు. విదేశాలకు వెళ్లే ముందు తన ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ సహా పర్యటన వివరాలు ఇవ్వాలనే షరతులను జగన్ ఉల్లంఘించారని HYD సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరఫు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది.