News September 29, 2024
అకౌంట్లో డబ్బులు జమ కాని వారికి GOOD NEWS

AP: భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన వారికి ప్రభుత్వం పరిహారం అందిస్తోంది. పలువురి బ్యాంక్ ఖాతాల్లో ఇప్పటికే నగదు జమ చేసింది. పలు కారణాలతో నగదు అందని బాధితులకు రేపు నేరుగా సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ కలెక్టరేట్లో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సాయం అందిస్తారు. అటు వరద సాయంలో పాల్గొన్న వారితో భేటీ కానున్న సీఎం వారికి ధన్యవాదాలు చెప్పడంతో పాటు సన్మానించనున్నారు.
Similar News
News November 4, 2025
VZM: ఈ నెల 6న జడ్పీ సర్వ సభ్య సమావేశం

జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఈనెల 6న ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జరుగనుందని CEO సత్యనారాయణ మంగళవారం తెలిపారు. అక్టోబర్ 29న నిర్వహించాల్సిన సమావేశాన్ని తుఫాన్ కారణంగా వాయిదా వేశామన్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నవంబర్ 6న సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.
News November 4, 2025
అందుకే ముంబై వెళ్లి WWC ఫైనల్ చూశా: లోకేశ్

AP: అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చే వైసీపీ చీఫ్ <<18199297>>జగన్<<>> మమ్మల్ని వేలెత్తి చూపిస్తున్నారని మంత్రి లోకేశ్ మండిపడ్డారు. ‘తుఫాను వేళ సీఎం నుంచి పంచాయతీ ఉద్యోగి వరకు ప్రజల వద్దే ఉన్నారు. తుఫాను వచ్చినప్పుడు మేమేం చేశామో తెలిసేందుకు మీరిక్కడ లేరు. నాకు మహిళలంటే గౌరవం, అందుకే ముంబై వెళ్లి WWC ఫైనల్ చూశా. తల్లి, చెల్లిని తరిమేసిన మీకు దేశభక్తి, మహిళా శక్తి గురించి ఏం తెలుస్తుంది’ అని కౌంటర్ ఇచ్చారు.
News November 4, 2025
ప్రతి 40 రోజులకో యుద్ధ నౌక: నేవీ చీఫ్

ప్రతి 40 రోజులకు ఒక స్వదేశీ యుద్ధనౌక లేదా జలాంతర్గామిని ఇండియన్ నేవీలోకి చేరుస్తున్నామని చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి వెల్లడించారు. 2035 నాటికి 200కు పైగా వార్ షిప్లు, సబ్మెరైన్లు కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం 52 నౌకలు భారత షిప్యార్డుల్లోనే నిర్మితమవుతున్నాయని తెలిపారు. కాగా ప్రస్తుతం మన వద్ద 145 యుద్ధ నౌకలు, జలాంతర్గాములు ఉన్నాయి.


