News April 1, 2024

రేషన్‌కార్డులు ఉన్న వారికి గుడ్‌న్యూస్

image

TG: రేషన్‌షాపుల్లో ఇవాళ్టి నుంచే రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు. గతంలో ప్రతి నెలా తొలి వారం ఆఖరులో, రెండో వారంలో రేషన్ షాపులు ప్రారంభం అయ్యేవి. దీనిపై లబ్ధిదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. ఇవాళ్టి నుంచి బియ్యం, గోధుమలు, చక్కెర పంపిణీకి ఏర్పాట్లు చేసింది.

Similar News

News January 26, 2026

బాలిక ప్రాణం తీసిన చైనా మాంజా

image

TG: హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. చైనా మాంజా మరొకరి ప్రాణం తీసింది. తండ్రితో కలిసి బైక్‌పై వెళ్తున్న ఐదేళ్ల నిష్విక(5) మెడను మాంజా మహమ్మారి కోసేసింది. దీంతో తీవ్ర రక్తస్రావంతో చిన్నారి విలవిల్లాడింది. తండ్రి వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. <<18870079>>చైనా మాంజా<<>>పై ఇండియాలో నిషేధం ఉన్నా, పోలీసుల హెచ్చరికలు ఉన్నా వాటి అమ్మకాలు ఆగకపోవడం శోచనీయం.

News January 26, 2026

రేపు బ్యాంకులు బంద్!

image

బ్యాంక్ ఉద్యోగులు రేపు బంద్‌కు పిలుపునిచ్చారు. వారంలో 5 వర్కింగ్‌ డేస్‌ను డిమాండ్ చేస్తూ బ్యాంకు యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. జనవరి 23న ఈ మేరకు ప్రకటన వెలువడింది. గత బుధవారం, గురువారం ఈ విషయంపై చీఫ్ లేబర్ కమిషనర్‌తో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో సమ్మె యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది! ఇప్పటికే పలు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు తమ సేవల్లో అంతరాయం ఏర్పడొచ్చంటూ కస్టమర్లకు మెసేజ్‌లు పంపాయి.

News January 26, 2026

రాజ్యాంగంలో ప్రతి పేజీపై ‘PREM’.. ఆయన ఎవరంటే?

image

భారత రాజ్యాంగ మూల ప్రతిలో ప్రతి పేజీపై ‘ప్రేమ్’ అనే పేరు ఉండటాన్ని ఎప్పుడైనా గమనించారా? ఆయనెవరో కాదు.. ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా. రాజ్యాంగ మూల ప్రతిని తన చేతిరాతతో రాసిన కళాకారుడు. దాదాపు 6 నెలల సమయాన్ని కేటాయించి అందంగా రాశారు. 251 పేజీలలో రాజ్యాంగాన్ని పూర్తి చేయగా.. ఎటువంటి వేతనం తీసుకోలేదు. బదులుగా ప్రతి పేజీపై తన పేరు, చివరి పేజీలో తన తాత పేరును రాసుకునేలా ఒప్పందం చేసుకున్నారు.