News September 23, 2024

రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త

image

TG: అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, మరో తీపికబురు అందించింది. రేషన్ కార్డు ఉన్న వారు రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా సరకులు తీసుకోవచ్చని CLP సమావేశంలో CM రేవంత్ ప్రకటించారు. త్వరలోనే ఫ్యామిలీ డిజిటల్ కార్డు తీసుకొస్తున్నామని, ప్రతి ఒక్కరికీ హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డు అందిస్తామన్నారు. ఇన్‌ఛార్జి మంత్రులు వారంలో రెండుసార్లు జిల్లాల్లో పర్యటించాలని సీఎం సూచించారు.

Similar News

News September 23, 2024

వేతన సవరణకు మరికొంత సమయం?

image

TG: రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వేతన సవరణకు మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. వేతన సవరణ సిఫార్సులకై ఏర్పాటు చేసిన పీఆర్సీ కమిటీ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. అయితే ఈ కమిటీ ఇంకా ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరపాల్సి ఉంది. ఆపై ఫిట్‌మెంట్, ఇతర అంశాలపై ప్రభుత్వంతో చర్చించి పూర్తి నివేదిక సిద్ధం చేస్తుంది. దీని కోసం కమిటీ గడువును మరో 3 నెలలు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News September 23, 2024

MLA నానాజీని సస్పెండ్ చేయాలని డిమాండ్

image

AP: కాకినాడ(R) MLA పంతం <<14168792>>నానాజీ <<>>పట్ల వైద్యులు ఇంకా గుర్రుగానే ఉన్నారు. కాకినాడ RMC వైద్యుడిపై దాడి చేసిన ఆయన్ను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్ చేసింది. MLA, ఆయన అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరింది. ఇవాళ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేయనుండగా, రేపు ఇతర సంఘాల మద్దతుతో కాకినాడ SPకి ఫిర్యాదు చేయనుంది. ఈ ఘటనపై MLA ఇప్పటికే క్షమాపణలు చెప్పారు.

News September 23, 2024

నటి జెత్వానీ కేసు.. రిమాండ్‌కు విద్యాసాగర్

image

ముంబై నటి జెత్వానీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె ఫిర్యాదుతో అరెస్టైన నిందితుడు కుక్కల విద్యాసా‌గర్‌కు ఏసీఎంఎం కోర్టు రిమాండ్ విధించింది. అక్టోబర్ 4 వరకు విద్యాసాగర్ రిమాండ్‌లో ఉండనున్నారు. అతడిని డెహ్రాడూన్ నుంచి నిన్న విజయవాడ తీసుకొచ్చిన పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ టెస్టులు చేయించి తెల్లవారుజామున 4వ ఏసీఎంఎం జడ్జి ఇంటి వద్ద హాజరుపర్చారు.