News May 7, 2025

LICలో హోంలోన్ తీసుకున్నవారికి శుభవార్త

image

కస్టమర్లకు LIC శుభవార్త చెప్పింది. హౌసింగ్ లోన్ రేటును 25 బేసిస్ పాయింట్లను తగ్గించింది. దీంతో గృహ రుణ రేటు ఈ నెల 28 నుంచి 8 శాతం వద్ద ప్రారంభమవుతుంది. కొత్తగా రుణం తీసుకున్న, తీసుకోబోతున్న వారికీ ఈ లబ్ధి చేకూరుతుందని సంస్థ వెల్లడించింది. ఇటీవల ఆర్బీఐ రెపో రేటును 0.25 శాతం తగ్గించడంతో ఆ మేర కుదించేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి.

Similar News

News March 27, 2026

బ్రేక్‌ఫాస్ట్ మెనూ రెడీ: 6 రోజులు.. 5 రకాలు

image

TG: ప్రభుత్వ స్కూళ్లలో 19 లక్షల మంది విద్యార్థుల కోసం ‘CM బ్రేక్ ఫాస్ట్ స్కీమ్’ మెనూను అధికారులు రెడీ చేశారు. దీని కోసం ప్రభుత్వం ₹720 కోట్లు కేటాయించింది. ఈ మెనూ ప్రకారం.. సోమవారం దోశ, మంగళవారం మిల్లెట్ ఇడ్లీ, బుధవారం పూరీ, గురువారం మిల్లెట్ ఇడ్లీ, శుక్రవారం మిల్లెట్ ఉప్మా/పొంగల్, శనివారం బోండా అందజేస్తారు. అలాగే సోమ, బుధ, శుక్రవారాల్లో పాలు.. మంగళ, గురు, శనివారాల్లో రాగి జావ ఇస్తారు.

News March 27, 2026

ఈ శ్రీరాముడి గుణాలే తారకమంత్రం!

image

శ్రీరాముడి నాయకత్వ లక్షణాలు నేటికీ ఆదర్శమే. ఎన్ని కష్టాలొచ్చినా నమ్మిన ధర్మాన్ని, విలువలను పక్కనపెట్టలేదు. భరతుడికి కబురు పంపితే రావణుడిపై దండెత్తడానికి మహాసైన్యమే వచ్చేది. కానీ 14ఏళ్ల వనవాసానికి భంగం కలగొద్దని వానరులనే రామదండుగా మార్చుకున్నాడు. ఉన్న వనరులతోనే విజయాలు సాధించొచ్చనడానికి ఇదో ఉదాహరణ. నిజాయతీ, నిబద్ధత, సమానత్వం, సమయపాలన పాటిస్తూ ఏ పని ఎవరికి అప్పగించాలో గ్రహించగలిగే సమర్థుడు రాముడు.

News March 27, 2026

10 లక్షల మందితో గ్రౌండ్ వార్‌కు ఇరాన్ రెడీ?

image

అమెరికాతో గ్రౌండ్ వార్ జరిగే ఛాన్స్ ఉందన్న వార్తలతో ఇరాన్ అలర్ట్ అయింది. ఏకంగా 10 లక్షల మంది ఫైటర్లను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బసిజ్, IRGC రిక్రూట్‌మెంట్ సెంటర్లకు వాలంటీర్లు భారీగా క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. అటు అమెరికా కూడా తన ఎలైట్ ఫోర్సెస్‌ను పశ్చిమాసియాకు పంపేందుకు ప్లాన్ చేస్తోంది. ట్రంప్ చర్చల గురించి చెబుతున్నా ఇరాన్ మాత్రం అప్రమత్తంగా వ్యవహరిస్తూ యుద్ధానికి సిద్ధమవుతోంది.