News November 20, 2024

ముగ్గురు పిల్లలున్న వారికి గుడ్‌ న్యూస్?

image

TG: ముగ్గురు సంతానం ఉన్న వారు సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధనను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పంచాయతీ‌రాజ్ చట్టాన్ని సవరించేందుకు నిర్ణయించిందని సమాచారం. దీంతో త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో ముగ్గురు పిల్లలున్న వారు కూడా సర్పంచ్‌లుగా పోటీ చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. అటు APలో ఇద్దరికి మించి సంతానం ఉన్న వారికి పోటీకి అవకాశం కల్పించింది.

Similar News

News February 4, 2026

అరక అరిగిన గరిసె విరుగును

image

‘అరక’ అంటే పొలం దున్నడానికి ఉపయోగించే నాగలి. ‘గరిసె’ అంటే ధాన్యాన్ని నిల్వచేసే కొట్టం. ఒక రైతు తన నాగలి అరిగిపోయేంత కష్టపడి పొలం దున్నితే, ఆ శ్రమకు తగిన ఫలితం దక్కుతుందని, ధాన్యం దిగుబడి విపరీతంగా పెరిగి, ధాన్యాగారా(గరిసె)లు నిండిపోతాయని దీని అర్థం. ఎంత కష్టపడి శ్రమిస్తే, అంత గొప్ప ఫలితాలు లభిస్తాయి అనే నీతిని ఈ సామెత తెలియజేస్తుంది.

News February 4, 2026

ప్రేమ, కరుణకు కేంద్రం ‘అనాహత చక్రం’

image

ఛాతీ మధ్యలో ఉండే ఈ చక్రం ప్రేమ, కరుణకు కేంద్రం. ఇది సమతుల్యంగా ఉంటే అందరిపై నిస్వార్థమైన ప్రేమ, క్షమాగుణం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. అస్థిరత ఏర్పడితే ఒంటరితనం, గుండె సంబంధిత ఇబ్బందులు, ఇతరులపై ద్వేషం కలుగుతాయి. దీనిని ఉత్తేజితం చేయడానికి ‘యం’ మంత్రాన్ని జపించాలి. ఆకుపచ్చని ప్రకృతిలో సమయం గడపడం, ప్రాణాయామం చేయడం, సాటి జీవుల పట్ల దయతో మెలగడం వల్ల ఈ చక్రం అద్భుతంగా పని చేస్తుంది.

News February 4, 2026

ఏడేళ్లలో 7,400 మంది నక్సలైట్ల అరెస్ట్: కేంద్రం

image

గడచిన దశాబ్దన్నర కాలం నుంచి దేశంలో వామపక్ష తీవ్రవాద ప్రేరేపిత హింసాత్మక ఘటనలు 88 శాతం మేర తగ్గాయని లోక్‌సభలో కేంద్రం వెల్లడించింది. ఏడేళ్లలో 7,400 మందికి పైగా నక్సలైట్లను అరెస్టు చేశామని, 5,880 మంది లొంగిపోయారని తెలిపింది. 2025లో 364 మంది నక్సలైట్లను భద్రతా బలగాలు హతమార్చాయని, 1,022 మందిని అరెస్టు చేశాయని, 2,337 మంది లొంగిపోయారని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ సభకు తెలిపారు.