News March 21, 2024

ప్రయాణికులకు GOOD NEWS

image

రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. జనరల్ టికెట్ బుకింగ్ కౌంటర్ల వద్ద నగదు చెల్లింపుల్లో ఇబ్బందులకు చెక్ పెడుతూ క్యూఆర్ కోడ్ అందుబాటులోకి తెచ్చింది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, BHIM ద్వారా డబ్బులు చెల్లించవచ్చు. దీంతో ప్రయాణికులకు చిల్లర కష్టాలు తొలగిపోనున్నాయి. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని 14 స్టేషన్లలోని 31 కౌంటర్ల వద్ద ఈ సౌకర్యాన్ని తీసుకొచ్చారు.

Similar News

News October 1, 2024

వందో బర్త్‌డే చేసుకున్న US మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్

image

అమెరికా 39వ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మంగళవారం 100వ పుట్టినరోజును జరుపుకొన్నారు. ఈ ఘనత సాధించిన తొలి అధ్యక్షుడిగా, సుదీర్ఘకాలం బతికి ఉన్న ప్రెసిడెంట్‌గా చరిత్ర సృష్టించారు. 1924, అక్టోబరు 1న జార్జియాలో జన్మించిన కార్టర్, 1971-1981 మధ్యలో దేశాధ్యక్షుడిగా పనిచేశారు. 2002లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 2015లో క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించినా నేటికీ కార్టర్ ఆరోగ్యంగానే ఉండటం విశేషం.

News October 1, 2024

మహిళా సామూహిక శక్తి బతుకమ్మ: కేసీఆర్

image

TG: బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు మాజీ CM కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ అస్తిత్వానికి, సాంస్కృతిక జీవనానికి ప్రతీక బతుకమ్మ. తరతరాలుగా మహిళా సామూహిక శక్తికి, ఐక్యతకు బతుకమ్మ దర్పణం. రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజల అస్తిత్వ ఆకాంక్షలకు వేదికగా నిలిచింది. బతుకమ్మ ప్రాశస్త్యాన్ని గుర్తించి BRS ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది’ అని ఆయన పేర్కొన్నారు.

News October 1, 2024

జపాన్ కొత్త ప్రధానిగా షిగేరు ఇషిబా

image

జపాన్ కొత్త PMగా రక్షణ శాఖ మాజీ మంత్రి షిగేరు ఇషిబా(67) మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. దేశానికి రక్షణను మరింత పటిష్ఠం చేయడమే తన లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. దేశ భద్రత అత్యంత బలహీనంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాంతీయంగా శాంతిస్థాపనకు, చైనాను అడ్డుకునేందుకు మిత్రదేశాలతో మైత్రిని మరింత బలోపేతం చేసుకోనున్నట్లు ప్రకటించారు. 19మంది మంత్రులతో కూడిన ఆయన క్యాబినెట్ ఈరోజు కొలువుదీరింది.