News May 21, 2024

మహిళలకు గుడ్‌న్యూస్

image

AP: 2024-25 ఆర్థిక సంవత్సరంలో 5.27 లక్షల పొదుపు సంఘాలకు ₹32,190 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని AP ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల కాలంలో కొత్తగా పొదుపు సంఘాల్లో చేరిన లక్ష మంది మహిళలకు కూడా రుణాలు ఇవ్వనుంది. 2023-24 ఆర్థిక ఏడాదిలో 5.39 లక్షల సంఘాలకు ₹20,437 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ₹42,533 కోట్ల రుణాలు అందించామంది. ఈసారి కూడా లక్ష్యాన్ని మించే అవకాశం ఉందని తెలిపింది.

Similar News

News November 27, 2025

రబ్బరు సాగు.. ఒక్కసారి నాటితే 40 ఏళ్ల దిగుబడి

image

కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, గోవాలో రబ్బరు సాగు ఎక్కువ. APలోని కొన్నిప్రాంతాల్లో రైతులు రబ్బరును సాగు చేస్తున్నారు. పంట నాటిన ఐదేళ్ల నుంచి దిగుబడి ప్రారంభమై 40 ఏళ్ల పాటు దిగుబడి, ఆదాయం వస్తుంది. ఈ పంటకు ఉష్ణ ప్రాంతాలు అనువుగా ఉంటాయి. కనీస ఉష్ణోగ్రత 25డిగ్రీల సెల్సియస్, గరిష్ఠ ఉష్ణోగ్రత 34డిగ్రీల సెల్సియస్‌గా ఉంటే దిగుబడి బాగుంటుంది. ఈ మొక్క పెరగాలంటే దాదాపు రోజుకు 6గంటల సూర్యకాంతి అవసరం ఉంటుంది.

News November 27, 2025

స్విగ్గీని బురిడీ కొట్టించిన కస్టమర్.. నెటిజన్ల ఫైర్!

image

ఆన్‌లైన్‌ సైట్స్‌లో వస్తువులు డ్యామేజ్ వస్తే సదరు సంస్థ రీఫండ్ చేయడం చూస్తుంటాం. కానీ ఓ వ్యక్తి డూప్లికేట్ ఫొటోతో ‘స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌’ను బురిడీ కొట్టించాడు. స్విగ్గీలో ఆర్డర్ చేసిన గుడ్ల ట్రే ఫొటోను, జెమిని నానో AI యాప్ ద్వారా గుడ్లు పగిలినట్లుగా ఎడిట్ చేసి కస్టమర్‌ కేర్‌కు పంపి, పూర్తి రీఫండ్‌ను పొందాడు. ఇలా చేయడం సరికాదని, నిజమైన బాధితులు నష్టపోతారని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

News November 27, 2025

MLC రాజీనామాపై 4 వారాల్లో తేల్చండి: హైకోర్టు

image

AP: MLC జయమంగళ వెంకటరమణ రాజీనామా లేఖపై నిర్ణయాన్ని తెలపాలని మండలి ఛైర్మన్‌ను హైకోర్టు ఆదేశించింది. రాజీనామాపై సుదీర్ఘకాలం నిర్ణయం తీసుకోకపోవడాన్ని తప్పుబట్టింది. విచారణ జరిపి 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. రాజీనామా లేఖ సమర్పించినప్పటికీ చైర్మన్ ఆమోదించడం లేదని జయమంగళ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది.