News December 31, 2024
మహిళలకు శుభవార్త

TG: డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. జనవరి 3న మహిళా శక్తి పథకం కింద 32 డ్వాక్రా సంఘాలకు సంచార చేపల విక్రయ వాహనాలను అందించనుంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఒక్కో యూనిట్కు రూ.10 లక్షల చొప్పున మంజూరు చేసింది. ఇందులో రూ.6లక్షలను (60%) సబ్సిడీగా నిర్ణయించగా వీటిని రూ.4లక్షలకే అందించనుంది. వడ్డీ లేని రుణం కింద రూ.4లక్షలు సెర్ప్ బ్యాంకుల నుంచి ఇప్పించనుంది.
Similar News
News December 8, 2025
IIIT-నాగపుర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు

IIIT-నాగపుర్ 6 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. బీటెక్, బీఈ, ఎంఈ, ఎంటెక్ , పీహెచ్డీ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నెలకు జీతం పీహెచ్డీ ఉన్నవారికి రూ.65వేలు, మిగతావారికి రూ.60వేలు చెల్లిస్తారు. దరఖాస్తు చేసిన తర్వాత కాపీని recruitment@iiitn.ac.in ఈమెయిల్కు పంపాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.iiitn.ac.in.
News December 8, 2025
జనవరిలో దావోస్ పర్యటనకు చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 19 నుంచి 23 వరకు అక్కడ ఆయన పర్యటించనున్నారు. దావోస్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు కానున్నారు. ఆయన బృందంలో మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. సీఎం తన పర్యటనలో పలువురు పారిశ్రామికవేత్తలను కలిసే అవకాశం ఉంది.
News December 8, 2025
ప్రెగ్నెన్సీలో మందులతో జాగ్రత్త

గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు మహిళలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో మందుల వాడకంపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మందులు, యాంటీబయాటిక్స్ వాడే ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మందులు కొనుక్కొని వాడకూడదు. డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడాలని చెబుతున్నారు.


